సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 16న తిరుమలలో రధ సప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. స్వామివారు ఏడు వాహనాలపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. మాఘ మాసంలో వచ్చే శుక్ల పక్ష సప్తమి తిథిని రథ సప్తమి లేదా మాఘ సప్తమి అంటారు. వేదాల ప్రకారం, శ్రీ సూర్యదేవుడు ఈ పవిత్రమైన రోజున జన్మించాడు. ప్రపంచానికి జ్ఞానాన్ని ఇచ్చాడు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలకు భారీగా తరలివచ్చే భక్తుల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. రథసప్తమిని మినీ బ్రహ్మోత్సవాలు అని కూడా అంటారు.
వాహన సేవల వివరాలు
- ఉదయం 5.30 నుండి 8 వరకు (సూర్యోదయం ఉదయం 6.40 గంటలకు) – సూర్య ప్రభ వాహనం
- ఉదయం 9 నుంచి 10 గంటల వరకు – చిన్నశేష వాహనం
- ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహనంఔ
- మధ్యాహ్నం 1 నుండి 2 వరకు – హనుమాన్ వాహనం
- మధ్యాహ్నం 2 నుండి 3 వరకు – చక్ర స్నానం
- సాయంత్రం 4 నుండి 5 వరకు – కల్ప వృక్ష వాహనం
- సాయంత్రం 6 నుంచి 7 వరకు – సర్వభూపాల వాహనం
- రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం
తిరుమల తిరుపతి దేవస్థానం ఆ రోజు ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసింది. సుప్రబాతం, తోమాల, అర్చన ఏకాంతంగా నిర్వహిస్తారు.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం విచక్షణ కోటాలో కేటాయించిన బ్రేక్ దర్శనం టిక్కెట్లను పొందుతున్న భక్తుల సౌకర్యార్థం TTD ఇటీవల SMS చెల్లింపు విధానాన్ని కొత్తగా ప్రవేశపెట్టింది. కొత్త విధానంలో, చెల్లింపు లింక్ SMS ద్వారా సెల్ ఫోన్ లకు పంపనున్నారు. భక్తులు ఆ లింక్‌పై క్లిక్ చేసి UPI లేదా క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. MBC-34 కౌంటర్‌కు వెళ్లకుండా బ్రేక్ దర్శన్ టిక్కెట్‌ల ప్రింటవుట్ తీసుకోవచ్చు. ఇప్పటికే CROలో లక్కీడిప్ ఆఫ్‌లైన్ ద్వారా సంపాదించిన సేవాటికెట్లను పొందుతున్న భక్తుల కోసం ఈ విధానం అమలుకానుంది.