నిరంతరం యాక్టివ్ గా పని చెయ్యడానికి శరీరం మిషన్ కాదు. ఏ పని చేసినా సరే.. తర్వాత కొంచెం విశ్రాంతి కోరుకుంటుంది. ఒత్తిడి నుంచి బయట పడాలనుకుంటుంది. రీఫ్రెష్మెంట్ కావాలంటుంది. మరి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? శరీరంలోనే కొన్ని 'రిఫ్రెష్' బటన్స్ ఉంటాయి. వాటిని ఆన్ చెయ్యాలంటే ఈ ఆసనాలు వేయాల్సిందే...
బితిలాసనం : ఈ ఆసనం అవును పోలి ఉంటది. రెండు చేతులను గడ్డం కింద ఉంచుకుని బోర్లా పడుకోవాలి. రెండు అరచేతులను నేలమీద ఉంచి మోకాళ్ల మీద లేవాలి. తర్వాత మెల్లిగా మోకాళ్లను, అరచేతులను నేలపై ఆనించాలి. ఈ పొజిషన్లో వీపును నేలకు సమాంతరంగా పెట్టి, ఆకాశం వైపు చూడాలి. తర్వాత శ్వాసపై ధ్యాస పెడుతూ.. యథాస్థితికి రావాలి. ఇలా పదిసార్లు చెయ్యాలి.
ఉపయోగాలు: ఇది శరీరం మొత్తానికి మంచి వామప్. మెడ, మొండెం, నడుముని చాపడం వల్ల వెన్నెముక బలంగా తయారవుతుంది. మెడ,నడుం, వెన్నుముక నొప్పులతో బాధపడేవాళ్లు రోజూ ఈ ఆసనం వేస్తే.. ఉపశమనం కలుగుతుంది. మూత్రపిండాలు, అధివృక్క గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది. ఒత్తిడి నుంచి బయటపడేసి మెదడుకు ప్రశాంతతనిస్తుంది. మెడనొప్పి ఉన్నవాళ్లు మెడ అంతగా పైకి ఎత్తకుండా కూడా చెయ్యవచ్చు.
సుప్త మత్సేంద్రాసనం: ముందుగా వెల్లకిలా విశ్రాంతి స్థితిలో పడు కోవాలి. ఫ్రీగా నేలకు సమాంతరంగా రెండు చేతులూ చాపాలి. రెండు కాళ్లను మోకాళ్ల వరకు మడిచి పక్కకు తీసుకురావాలి. తర్వాత ఎడమ అరచేతి వైపు చూపు నిలపాలి. ఈ సమయంలో శ్వాస మీద ధ్యాస ఉంచాలి. పైన చెప్పిన విధంగానే కుడి వైపు కూడా చెయ్యాలి. ఇలా పదిసార్లు చెయ్యాలి.
ఉపయోగాలు : వెన్నెముకకు సహజమైన మసాజ్ లభించి.. లోయర్ బ్యాక్ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. నడుము చుట్టూ ఉండే అవయవాల పనితీరు మెరుగుపడుతుంది.
జాగ్రత్తలు: నడుం, మోకాళ్లకు గాయాలై కోలుకున్నవాళ్లు ఈ ఆసనం చెయ్యకూడ దు. గర్భిణులు యోగా నిపుణుల సమక్షంలో ఈ ఆసనం వేయాలి.
శశాంకాసనం: ముందుగా వజ్రాసనంలో కూ ర్చోవాలి. తర్వాత రెండు కాళ్లను సాధ్యమైనంత మేరకు సైడు చాపాలి. ఇప్పుడు శ్వాస వదులుతూ నుదుటిని నేలకు వీలైనంత దగ్గరలోకి తీసుకుపోవాలి. తర్వాత చేతులను ముందుకు బాగా సైచ్ చేస్తూ ఉంచాలి. తర్వాత శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రావాలి. ఇలా పదిసార్లు చెయ్యాలి.
ఉపయోగాలు: ఈ ఆసనంతో మెదడుకు ప్రశాంతత చేకూరుతుంది. డిప్రెషన్లో ఉన్నవాళ్లు రోజూ ఈ ఆసనం ప్రాక్టీస్ చేస్తే సులభంగా బయటపడొచ్చు. మెదడుకి రక్తసరఫరా పెరగడం వలన పార్కిన్సన్, బ్రెయిన్ ఎటక్సి యా అల్జీమర్స్ వంటి సమస్యలకు కొంతవరకూ పరిష్కారం లభిస్తుం ది. పొట్ట దగ్గర అవయవాలకు టోనింగ్ జరిగి జీర్ణవ్యవస్థ మెరుగు పడుతుంది. శృంగార రుగ్మతలు కూడా నయమవుతాయి.
జాగ్రత్తలు: మోకాళ్లనొప్పులు, ఊబకాయం సమస్యలతో బాధపడుతున్న వాళ్లు యోగా నిపుణుల సమక్షంలో చెయ్యాలి.
మార్గాలాసనం: మార్గాలం అంటే పిల్లి, పిల్లి కోపంగా ఉన్నప్పుడు ఇచ్చే పోజే ఈ ఆసనం! రెండు చేతులను గడ్డం కింద ఉంచుకుని బోర్లాపడుకోవాలి. రెండు అరచేతులను నేలమీద ఉంచి మోకాళ్ల మీద లేవాలి. ఈ స్థితిలో చేతులు నిటారుగా ఉండాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ వీపును కిందకు వంచి తలను పైకెత్తాలి. తర్వాత మెల్లిగా మోకాళ్లను, అరచేతులను ఫొటోలో కనిపిస్తున్నట్టుగా నేలపై ఆనించాలె. ఈ పొజిషన్లో వీపును నేలకు సమాంతరంగా పెట్టి, ఆకాశం వైపు చూడాలి. తర్వాత శ్వాసపై ధ్యాన పెడుతూ.. యథాస్థితికి రావాలి. తర్వాత శ్వాస వదులుతూ వీపును పైకి లేపి తలను కిందికి వంచి నాభిని చూడాలి. ఇలా పదిసార్లు చెయ్యాలి.
ఉపయోగాలు: ప్రసవం తర్వాత ఈ ఆసనాన్ని చేయడం వల్ల శరీరాన్ని మునుపటి ఆకృతికి తీసుకురావొచ్చు. వెన్నెముక ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. భుజాలు, మోచేతులు, మణికట్టు బలంగా మారుతాయి. ఆస్తమా, థైరాయిడ్, గుండె సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతంది. మలబద్ధకం సమస్యలు తొలగిపోతాయి. నడుము కండరాలు శక్తివంతం అవుతాయి. నడుమునొప్పి ఉన్నవాళ్లు రోజూ ఈ ఆసనం చేస్తే మేలు జరుగుతుంది.
జాగ్రత్తలు: వెన్నుపూస సమస్య ఉన్నవళ్లు, స్పాండి లోసిస్ ఉన్నవాళ్లు ఈ ఆసనం వేయొద్దు. మోకాళ్ల నొప్పులు ఉన్నవాళ్లు, ఊబకాయంతో బాధపడుతున్నవాళ్లు యోగా నిపుణులపర్యవేక్షణలో చెయ్యాలి.