Good Health: జ్ఞాపకం సులభమే..!

చాలామంది పిల్లలు చదివింది గుర్తుంచటం లేదు అంటుంటారు,పెద్దవాళ్లేమో వయసుతోపాటు జ్ఞాపకశక్తి తగ్గిందంటారు. యువతేమో ఒత్తిడి ఎక్కువై అవసరమైనప్పుడు ఏవీ గుర్తుకు రావడం లేదని చెప్తుంటారు. మరి నిపుణులేమో జ్ఞాపకశక్తిని పెంచుకోడానికి చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే చాలని అంటున్నారు.ఏ సమాచారాన్ని గుర్తు పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ సమాచారం పై ఆసక్తి పెంచుకోవాలి చుట్టు ఉన్న ప్రజలు, వాళ్లు చేస్తున్న పనుల మీద ఇష్టం ఉంటే వాళ్లకు సంబంధించిన సమాచారం గుర్తుంటుంది.

కొందరికి మనుషులు బాగా తెలిసే ఉంటారు, వాళ్ల పేర్లు మాత్రం మర్చిపోయి ఉంటారు. పరిచయం అయిన వాళ్లను ఎక్కువసార్లు పేర్లతో పిలిస్తే, మెదడు సులభంగా ఆ వ్యక్తులను పేర్లతో గుర్తు పెట్టుకుంటుంది. అలాగే తెలియని సమాచారం జ్ఞాపకం పెట్టుకోవాలంటే దాన్ని తెలిసిన సమాచారంతో లింక్ పెట్టి చూడాలి. చదివిన సమాచారాన్ని జీవితానికి, రోజువారీ చర్యకు అన్వయించుకోగలిగితే జ్ఞాపకం ఉంచుకోవడం చాలా సులభం. అలాగే తెలుసుకున్న సమాచారాన్ని సూత్రాలసాయంతో అర్ధం చేసుకుంటే.. ఎక్కువకాలం మనసులో ఉంటుంది. ఇలాంటి చిట్కాలు పాటిస్తే.. జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు.