Beauty Tips: ఇలా చేస్తే ముఖంపై మచ్చలు..మొటిమలు రావట..

 ముఖంపై వచ్చిన మొటిమలు, నల్ల మచ్చలు తగ్గడానికి వివిధ రకాల సౌందర్య సాధనాలను ఉపయోగిస్తారు. కొన్ని సందర్భాల్లో అయినా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. మొటిమలతో ఇబ్బందిపడే వారు ఈ టిప్స్ ఫాలో అయితే బ్యూటీ ప్రొడక్ట్స్ వాడకుండానే సహజంగా అందంగా కనిపించే అవకాశం ఉంటుంది. మరి ఆ టిప్స్ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.

యువత అందానికి ఎంత విలువ ఇస్తారో చెప్పనక్కరలేదు. ఏదైనా పంక్షన్​ కు వెళ్లాలన్నా..టూర్​ కు  వెళ్లాన్నా..ఎంతగానో ముస్తాబు అవుతారు. అయితే ఎంత ముస్తాబు అయిన ముఖంపై చిన్న మొటిమ ఉన్నా.. మచ్చలు ఉన్నా వారి చాలా ఇబ్బందిగా ఫీలవుతారు. అలాంటి సమయంలో   అందంగా కనిపించడం కోసం చాలా మంది రకరకాల క్రీములను వాడుతూ ఉంటారు. 

ఆహారపు అలవాట్లు: ముఖం అందంగా మొటిమలు లేకుండా ఉండాలనుకునేవారు రోజు తీసుకునే ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా డైట్‌లో కూరగాయలు, ఆలివ్ నూనె, తృణధాన్యాలు ఎక్కువ మొత్తంలో ఉండేలా చూసుకోవాలి. అంతేకాకుండా తక్కువగా మాంసం వంటివి తినాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అందంగా కనిపించేందుకు అవకాశం ఉంటుంది. మొటిమల సమస్య రాకుండా ఉండాలంటే బరువు కూడా అదుపులో ఉంచుకోవడం ముఖ్యం.

శుభ్రత ముఖ్యం: సాధారణంగా మనం మొబైల్స్, ల్యాప్‌టాప్ వంటి గాడ్జెట్‌లను ఉపయోగిస్తున్నప్పుడు వాటిపై పేరుకుపోయిన దుమ్ము, ధూళిని అంతగా పట్టించుకోము. కానీ వాటిపై చేరే బ్యాక్టీరియా చేతికి అంటుకుని అది ముఖం స్క్రీన్ పైకి చేరుతుంది . ఇలా కూడా మొటిమలు రావడానికి అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కొన్ని అధ్యయనాల్లో పబ్లిక్ టాయిలెట్ కంటే మొబైల్ స్క్రీన్‌పై ఎక్కువ అపరిశుభ్రత ఉంటుందని తేలింది. కాబట్టి ఫోన్ స్క్రీన్‌తో పాటు ఇతర గార్జెట్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం మంచిది.
ఇలా అస్సలు చేయకూడదు:

కొంతమందికి పదే పదే ముఖానికి చేతులను తాకించే అలవాటు ఉంటుంది. ఫలితంగా చేతులకు ఉన్న క్రిములు ముఖంపైకి చేరి మొటిమలు ఎక్కువవుతాయి. కాబట్టి ముఖం కడుక్కునేటప్పుడు తప్ప మిగతా సమయంలో వీలైనంత వరకు చేతులను ముఖానికి తాకించకుండా ఉండడం మంచిది. వీలైనంత వరకు చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల పొరపాటున ముఖంపై చేతులు టచ్ చేసిన ఎటువంటి బ్యాక్టీరియా ఫేస్ పైకి చేరదు. దీంతో ముఖంపై మొటిమలు రాకుండా ఉండొచ్చు.

ఫేస్ వాష్: రోజులో రెండు సార్లు ఫేస్ వాష్ చేసుకోవడం చాలా తక్కువ మంది చేస్తుంటారు. మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే ఒక సారి అయితే, నైట్ పడుకునే ముందు రెండవ సారి. అయితే ముఖంపై మొటిమలు రావడానికి ఇలా రెండుసార్లు ముఖం కడుక్కోవడం కూడా ఓ కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖాన్ని రోజుకు రెండు సార్లు శుభ్రం చేసుకోవడమే కాకుండా తప్పకుండా చెమట ఎక్కువగా వచ్చినప్పుడు అంత కంటే ఎక్కువ సార్లు ఫేస్ వాష్ చేసుకోవాలి. దీంతో ముఖంపై దుమ్ము, జిడ్డు తొలగిపోయి చర్మ రంధ్రాలు మూసుకుపోకుండా ఉంటాయి. మొటిమలు కూడా ఏర్పడవు. అయితే ఈ క్రమంలో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే చర్మ తత్వానికి సరిపడే క్రీములను మాత్రమే ఫేస్ వాష్ కోసం సెలెక్ట్ చేసుకోవాలి.