ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్

సుల్తానాబాద్, వెలుగు: సుల్తానాబాద్ పట్టణంలోని బస్టాండ్ ముందు రాజీవ్ రహదారిపై మంగళవారం టిప్పర్.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు స్వల్పంగా గాయపడ్డారు. మంథని డిపోకు చెందిన బస్సు సుల్తానాబాద్ బస్టాండు లోపల నుంచి రోడ్డెక్కుతుండగా పెద్దపల్లి వైపు అతి వేగంగా వెళ్తున్న టిప్పర్ ఢీకొంది. ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. బస్సు కొంత భాగం ధ్వంసమైంది. ప్రమాదంతో రాకపోకలు స్తంభించాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.