Viral Video: నీటి గుంట నుంచి ప్లాస్టిక్ బాటిల్ ను ఎత్తుకెళ్లిన పులి

సోషల్ మీడియాలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఈ మధ్య  జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా పాములు, ఏనుగులు, పులుల వీడియోలు నెటిజన్స్ ఎక్కువగా వీక్షిస్తున్నారు. కొంచె ఢిపరెంట్ గా ఉంటే చాలు ఏ వీడియో అయినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయిపోతుంది.  తాజాగా పెద్ద పులికి సంబంధించిన ఓ షాకింగ్ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. కావాలంటే మీరు ఓ లుక్కేయండి.

ఎక్కడో అడవిలో జరిగేవి కూడా టెక్నాలజీ ద్వారా మన ముందుకు వచ్చేస్తున్నాయి.  అడవిలోని నీటి గుంటలో నుంచి ప్లాస్టిక్ బాటిల్‌ను పులి ఎత్తుకెళ్తున్న వీడియో ఒకటి.. ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తోంది. వైల్డ్ లైఫ్ ఫొటో గ్రాఫర్ దీప్ కతికర్ ఈ వీడియోను చిత్రీకరించారు. గంభీరమైన పులి నోటిలో ప్లాస్టిక్ బాటిల్ ఉండటం నిజంగానే ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వీడియోలో పులి ప్లాస్టిక్ బాటిల్‌ను ఎత్తుకెళ్తున్నట్లు ఉంది.

ఒక పులి నీటి వద్దకు నడుస్తూ వెళ్లింది. దాహం తీర్చుకునేందుకు అని అంతా అనుకున్నారు. కానీ అక్కడికి వెళ్లిన పులి నీటిలో తేలియాడుతున్న ప్లాస్టిక్ బాటిల్ ను నోట కరుచుకొని బయటకు తీసింది. దాన్ని ఏం చేస్తుందా? అన్న ఆతృత అందరికీ ఉండగా.. ఆ బాటిల్ తో కొంత దూరం నడుచుకుంటూ వెళ్లి అక్కడ పడవేసింది. వేటాడాల్సిన పులి.. దీనికి విరుద్ధంగా ఇలా ప్లాస్టిక్ వ్యర్థాలను నీటి నుంచి తొలగించడం అదరినీ తలదించుకునేలా చేసింది.


 రామ్‌డేగి కొండల్లో భానుష్కిండి అనే పులి కూన ఈ విధంగా ప్లాస్టిక్ సీసాను పట్టుకు వస్తోందని ఫోటో గ్రాఫర్ వివరించారు. ఈ ఫోటోను తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో  షేర్ చేశారు. ‘పులి అందించిన మధుర సంకేతం’ అన్న శీర్షిక పెట్టారు.  ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి అడవులను పరిశుభ్రం చేసుకోవాలన్న సందేశం వినిపించారు. పులి తన చర్యల ద్వారా అద్భుతమైన సందేశాన్ని ఇచ్చింది. మేము మా అడవులను శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నిస్తాం  అంటూ క్యాప్షన్ పెట్టారు.

ఈ వీడియోకు నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది.  పులి బాటిల్ పట్టుకుని వస్తున్న దృశ్యాన్ని చూసి సోషల్ మీడియా యూజర్లు మైమరచిపోయారు. అంతే బాధపడ్డారు. ఈ దృశ్యం అందంగా ఉంది, అదే సమయంలో విచారంగా ఉంది. మనం చేయాల్సిన పనిని ఒక పులి చేయవలసి వచ్చినందుకు సిగ్గుపడాల్సిందే’ అంటూ ఒకరు వ్యాఖ్యానించారు. ‘అందమైన వీడియో. మన అడవిని ప్రేమిద్దాం. ప్లాస్టిక్ రహితంగా ఉంచడానికి ప్రయత్నిద్దాం’ అని మరొక వినియోగదారు చెప్పారు. ‘వావ్, ఎంత మంచి వీడియో... ప్లాస్టిక్ నిషేధం ఆవశ్యకత గురించి అవగాహన పెంచేలా ఉంది’ అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అరే.... ఈ పులి చాలా విచిత్రంగా ఉందే’.. అంటూ కొందరు, ‘పులిని చూసి చాలా నేర్చుకోవాలి’.. అని మరికొందరు.. ఈ వీడియో 93 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

 వీడియో చాలా పవర్ ఫుల్ గా ఉందని ఒక యూజర్ కామెంట్ చేశాడు.ప్లాస్టిక్ వాడకాన్ని( Plastic Usage ) ఎందుకు మానేయాలి అని ఈ వీడియోలో చూపించామని, దీన్ని అందరూ చూడాల్సిందేనని దీప్ అన్నారు.వన్యప్రాణులను ఇష్టపడే కొందరు వీడియోపై తమ అభిప్రాయాలను కూడా పంచుకున్నారు.ఈ వీడియో X అనే మరో వెబ్‌సైట్‌లో పోస్ట్ కూడా పోస్ట్ చేశారు.భారత అటవీ శాఖలో ఐఎఫ్ఎస్ అధికారిగా పనిచేస్తున్న సుశాంత నంద( Susanta Nanda ) ఈ వీడియోను ఎక్స్‌లో రీపోస్ట్ చేశారు. దయచేసి అడవి ప్రదేశాల్లోకి ప్లాస్టిక్, ఇతర వస్తువులను తీసుకురావద్దని ప్రజలను కోరారు.నాగరికంగా ఉండాల్సిన మనం అనాగరికంగా ప్రవర్తిస్తున్నాం, జంతువులు వాటిని శుభ్రం చేయాల్సిన దుస్థితి వచ్చింది అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.సుశాంత నంద కూడా ఎక్స్‌లో మరో మెసేజ్ రాశారు. దీప్ కతికర్ కూర్చున్న కారు ముందు పులి బాటిల్‌ను విసిరిందని చెప్పారు.పులి మనకు స్పష్టమైన సందేశం ఇస్తోందని అన్నారు.