Ganesh Chaturthi 2024 : డ్యాన్స్​ చేస్తున్న వినాయకుడు ఎక్కడున్నాడో తెలుసా...

మనకు పొరుగున ఉన్న శ్రీలంక, నేపాల్తో పాటు: వియత్నాం. మలేసియా, కంబోడియా, సింగపూర్ దేశాల్లో వినాయకుడి ఆలయాలు ఉన్నాయి. వీటిల్లో కంబోడియా కందాలలో ఉన్న పద్మాసన గణేశ్ టెంపుల్' చాలా ఫేమస్. అలాగే వియత్నాంలో అక్కడక్కడ వినాయకుడి ఆలయాలు. చిన్న విగ్రహాలు అంతటా కనిపిస్తాయి. విశేషం ఏంటంటే.. 

శైవత్వంలోనే ఇక్కడి ఆలయాల్లో పూజలు జరుగుతుంటాయి. మలేసియాలో కేవలం కౌలాలంపూర్ సిటీలోనే ఆరు టెంపుల్స్, మిగతా ప్రాంతాల్లో పదికి పైగా ఆలయాలు ఉన్నాయి. వీటిల్లో ఎక్కువ ఆలయాలు ఈ మధ్య కాలంలోనే కట్టించినవి ఉన్నాయి. నేపాల్లో వినాయకుని హేరంబగా ఆరాధిస్తారు. ఐదు తలల రూపంలో ఉండే హేరంబకి వాహనంగా మూషికం ప్లేస్లో సింహం ఉంటుంది. టిబెట్ సృత్యముద్రలో (డ్యాన్సింగ్ ఫోజులో) ఉన్న గణపతిని మాత్రమే పూజిస్తారు. శ్రీలంకలో వేల ఏండ్ల చరిత్ర ఉన్న ఆలయాలు, వాటిల్లో వినాయకుడి మండపాలు ఉన్నాయి.. పూజలు అందుకుంటున్నాయి.

 

  • ప్రాచీన గ్రామకథల్లో విఘ్నేశుడి ప్రస్తావన ఉంది. వేల సంవత్సరాల క్రితం ఈ భూమ్మీద చాలా చోట్లలో.. ముఖ్యంగా సెంట్రల్ ఏషియాలో ప్రజలు గణేశుడిని పూజించేవాళ్లని ఆక్స్ఫర్డ్ పబ్లికేషన్ ఒక కథనం ప్రచురించింది.
  • చైనాలో క్రీస్తు శకం ఆరవ శతాబ్దం నాటికే విఘ్నేశుడిని పూజించేవాళ్లని ఆనవాళ్లు చెప్తున్నాయి.
  •  హిందూ మతంలోనే కాదు.. ఇతర మతస్తులు కూడా గణనాథుడిని ఆరాధిస్తుంటారు. జైనులు తమ వ్యాపారాలు సజావుగా సాగేందుకు గణేశుడికి పూజలు చేస్తుంటారు. ఈ క్రమంలో గణేశుడికి, కుబేరుడి లక్షణాలను ఆపాదించారని చెప్తుంటారు పెద్దలు. మరోవైపు బౌద్ధ గ్రంథాలలో అక్కడక్కడా గణపయ్య ప్రస్తావన కనిపిస్తుంది.
  •  క్రీస్తు పూర్వం ఒకటి, మూడవ శతాబ్దాలలో ఇండో-గ్రీకు కాయిన్ల పైన వినాయకుడి ప్రతిరూపం ఉండటాన్ని గుర్తించారు. అంతేకాదు ఏనుగు తల ప్రతిమను పూజించిన కొన్ని జాతుల్ని, తెగల గురించి చరిత్రలో పేర్కొన్నారు.

ALSO READ | Ganesh Chaturthi 2024 : విదేశాల్లోనూ వినాయకుడు చాలా ఫేమస్: ఆ దేశాలు ఇవే

  • ఆఫ్గనిస్తాన్, ఇరాన్, మయన్మార్, లావోస్, మంగోలియా, జపాన్, బ్రూనే, బల్గేరియా, సౌతాఫ్రికా, మెక్సికో, లాటిన్ అమెరికా దేశాల్లో వినాయకుడి ఆలయాలు. గుర్తులు బయటపడ్డాయి. ఆ లెక్కన 'యూనివర్సల్ గాడ్'గా వేల సంవత్సరాల క్రితం నుంచే పూజలు అందుకున్నట్లు అర్థమవుతోంది.
  •  గణపతి ఆరాధన క్రీస్తుశకం ఐదు ఆరు శతాబ్దాల కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చినా, దీనికి మూలాలు సింధులోయ నాగరికత కాలంలోనే ఉండేవని చరిత్రకారులు చెబుతున్నారు.
  • ఇరాన్లో 1993లో జరిపిన తవ్వకాల్లో లోరెస్తాన్ ప్రావిన్స్ దగ్గర ఏనుగు బొమ్మతో ఉన్న ఒక లోహపలకం దొరికింది. ఇది క్రీస్తు పూర్వం వెయ్యవ శతాబ్దానికి చెందినట్లుగా గుర్తించారు. దీంతో వేల సంవత్సరాల క్రితమే గణేశుడి ఆరాధన ఉండేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే మయాన్, ఓల్బెక్, ఇండస్ నాగరికతలకు చెందిన వాళ్ళు జంతువులను పూజించే వాళ్లు. బహుశా ఆ సంప్రదాయాన్ని అనుసరించే ఏనుగు ముఖాన్ని చెక్కిఉంటారని మరికొందరు చరిత్రకారులు చెప్తున్నారు.