డ్రైనేజీలో పడి మూడేండ్ల చిన్నారి మృతి

  • నిజామాబాద్‌‌ జిల్లా ఆర్మూర్‌‌లో విషాదం

ఆర్మూర్, వెలుగు : ఆడుకునేందుకు బయటకు వెళ్లిన మూడేండ్ల చిన్నారి డ్రైనేజీలో పడి చనిపోయింది. ఈ ఘటన నిజామాబాద్‌‌ జిల్లా ఆర్మూర్‌‌ పట్టణంలో గురువారం జరిగింది. ఆర్మూర్‌‌లోని 35వ వార్డు పరిధి రాంనగర్‌‌ కాలనీకి చెందిన మట్ట ప్రశాంత్‌‌, సునీత దంపతుల కూతురు ధనశ్రీ (3) గురువారం మధ్యాహ్నం ఆడుకునేందుకు బయటకు వెళ్లింది. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఇంటి పరిసరాల్లో గాలించినా కనిపించలేదు. చివరకు అనుమానం వచ్చి సమీపంలోని డ్రైనేజీలో చూడగా ధనశ్రీ కనిపించింది. వెంటనే బయటకు తీసి చూడగా అప్పటికే చనిపోయింది.