చిన్నారిపై కుక్కల దాడి..తీవ్ర గాయాలు

గోదావరిఖని, వెలుగు : రామగుండం టౌన్​మజీద్​ కార్నర్​ వద్ద బుధవారం మూడేళ్ల బాలుడు హైమాన్​పై వీధి కుక్కలు దాడి చేశాయి. ఇంటి సమీపంలో బహిర్భూమికి వెలుతుండగా అటుగా వచ్చిన కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి తల పైభాగంలో కొరికాయి. స్థానికులు, కుటుంబ సభ్యులు గమనించి వాటిని తరిమారు.

అనంతరం వెంటనే గోదావరిఖనిలోని గవర్నమెంట్​ జనరల్​ హాస్పిటల్​కు తరలించారు. బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠాకూర్​ ఫోన్​లో ధైర్యం చెప్పారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్​, డిప్యూటీ మేయర్​ అభిషేక్​ రావు హాస్పిటల్​కు వెళ్లి బాలుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.