Diwali special 2023: దీపావళి భారతదేశంలోని అతిపెద్ద పండుగలలో ఒకటి. ప్రజలు ఏడాది పొడవునా ఈ పండుగ కోసం ఎదురుచూస్తుంటారు. దీపావళి వచ్చిందంటే పిల్లలకు పెద్దలకు ఎనలేని సంతోషం. దీపావళి పండుగను భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకుంటారు. దీపావళి పండుగను చాలా ప్రత్యేకమైన రీతిలో జరుపుకునే ప్రపంచంలోని కొన్న దేశాల గురించి తెలుసుకుందాం..
జపాన్(japan) లో దీపావళిని చాలా విభిన్నంగా జరుపుకుంటారు. ఇక్కడ ప్రజలు దీపావళి పండుగను తోటలకు వెళ్లి జరుపుకుంటారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ప్రజలు ఇక్కడ దీపాలకు బదులుగా రంగురంగుల లాంతర్లను ఉపయోగిస్తారు. వాటిని చెట్లను అలంకరిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సంతోషం, శ్రేయస్సు, పురోభివృద్ధి కలుగుతుందని జపాన్ ప్రజలు నమ్ముతారు. ఇక్కడ దీపావళి రోజున ప్రజలు రాత్రంతా నృత్యం చేసి పండుగను ఆనందిస్తారు. మలేషియా మలేషియాలో దీపావళిని హరి దీపావళి అని పిలుస్తారు.
మలేషియా(malasia)లో కూడా ప్రజలు దీపావళి(diwali) పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అయితే, ఇక్కడ హిందూ జనాభా మాత్రమే దీవపావళి పండుగను జరుపుకుంటారు. గణాంకాల ప్రకారం, మలేషియా మొత్తం జనాభా దాదాపు 3.5 కోట్లు, ఇందులో మొత్తం హిందువుల జనాభా దాదాపు 21 లక్షలు. ఇక్కడ ప్రజలు తమ ఇళ్ల వెలుపల కొవ్వొత్తులు, దీపాలను వెలిగిస్తారు. మలేషియాలో దీపావళి రోజున ముందుగా శరీరానికి నూనె రాసుకుని స్నానం చేస్తారు.
శ్రీలంక పేరు రామాయణ కాలంతో ముడిపడి ఉంది. శ్రీలంక(srilanka)లో పెద్ద సంఖ్యలో హిందూ ప్రజలు కూడా నివసిస్తున్నారు, ఇక్కడ ప్రజలు లామ్ క్రియోంగ్ పేరుతో దీపావళిని జరుపుకుంటారు. .దీపావళి పండుగ రోజున రాముడు(Lord Ram) అయోధ్య నగరానికి తిరిగి వచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. ఆయన రాకను పురస్కరించుకుని ప్రజలు దీపాలు(lamp) వెలిగించి స్వాగతం పలికారు. ఈ పండుగ రోజున భారతదేశం మొత్తం దీపాల వెలుగుతో ప్రకాశిస్తుంది. ముఖ్యంగా అయోధ్య(ayodhya)లో దీపావళి సీన్ వేరు. ఇక్కడ లక్షల దీపాలు ఏకకాలంలో మెరుస్తున్నాయి. చెడుపై మంచి సాధించిన విజయంగా ప్రజలు దీపావళి పండుగను జరుపుకుంటారు. ఇక్కడ దీపావళి పద్ధతి కొద్దిగా భిన్నంగా ఉంటుంది, ప్రజలు దీపాలలో కొవ్వొత్తులు, నాణెం, ధూపం ఉంచుతా తర్వాత దానిని నదిలో వదులుతారు.