ముగ్గురు చిన్నారులపై కుక్కల దాడి

వీణవంక, వెలుగు : కరీంనగర్ జిల్లా వీణవంక మండలం గన్ముకుల గ్రామంలో బుధవారం రాత్రి పిచ్చికుక్కలు ముగ్గురు చిన్నారులపై దాడి చేశాయి. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన నాగ ప్రణయ్ (12), రిషి (10) ఆరుబయట ఆడుకుంటున్నారు.

ఈ టైంలో కుక్కలు చిన్నారులపై దాడి చేశాయి. గమనించిన స్థానికులు వాటిని తరిమేశారు. అలాగే కమ్మరివాడకు చెందిన స్వప్న పైనా దాడి చేయడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన ముగ్గురిని చల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.