వైన్ షాప్‌లో స్టఫ్ ఫ్రీగా ఇవ్వాలని.. కత్తితో బెదిరించారు

జగిత్యాల జిల్లా: మద్యం దుకాణంలోకి వెళ్లి ఇద్దురు వ్యక్తులు స్టఫ్ ఫ్రీగా ఇవ్వాలని పర్మిట్ రూమ్ నిర్వాహకుడిపై దాడికి దిగారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రలోని ఓ వైన్ షాప్ లో జరిగింది. శేఖర్, పుల్లయ్య అనే ఇద్దరు వ్యక్తులు మద్యం కొన్నందుకు, స్టఫ్ ఫ్రీగా ఇవ్వాలని పర్మిట్ రూంలోని యజమానిని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వాల్సిందే అని అతడు చెప్పడంతో కత్తితో దాడికి యత్నించారు. 

మేము లోకల్ మమ్ముల్ని డబ్బులు అడుగుతావా అని బాధితులన్ని చితకబాదారు శేఖర్, పుల్లయ్యలు.. పర్మిట్ రూం నిర్వహకుని చేతికి కత్తి గాట్లు పడ్డాయి. వారి మధ్య జరిగిన గొడవ అంతా సీసీకెమెరాలో రికార్డ్ అయ్యింది. పర్మిట్ రూం వ్యక్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు దాడికి యత్నించిన కేసు నమోదు చేశారు.

Also read :ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి : శివ