వేములవాడ మున్సిపల్​ ఆఫీసులో వేల కొద్దీ బతుకమ్మ చీరలు

 

  •     గత ఏడాది పంచగా మిగిలాయన్న కమిషనర్​

వేములవాడ, వెలుగు : వేములవాడ మున్సిపల్​ఆఫీసులోని పై అంతస్తులోని మీటింగ్​ హాల్​పక్క గదిలో సంచుల్లో ప్యాక్​చేసి ఉన్న వేలాది బతుకమ్మ చీరలు దర్శనమిచ్చాయి. శనివారం ఈ విషయాన్ని మున్సిపల్​ కౌన్సిల్​సమావేశానికి వచ్చిన ప్రభుత్వ విప్​, వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ ​దృష్టికి తీసుకువెళ్లగా ఆయన కమిషనర్​ను వివరణ కోరారు. దీంతో ఆయన గత ఏడాది మహిళలకు పంచగా మిగిలిన చీరలని సమాధానమిచ్చారు. గత బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో అందరికీ బతుకమ్మ చీరలు అందలేదు. ఒకవైపు తమకు చీరలు రాలేదని మహిళలు గగ్గోలు పెట్టగా, వేలాది చీరలు మున్సిపల్ ​ఆఫీసులో బయటపడడం గమనార్హం.