ట్రావెల్ : టూరిస్ట్ లు తక్కువే.. అవీ అద్భుతాలే!

గ్లోబల్ టూరిజం విపరీతంగా పెరిగింది. ప్రపంచమే ఒక ఊరిలా మారిపోయింది. అందుకే ఈ కాలంలో ఫారిన్‌‌‌‌‌‌‌‌ టూర్స్ చాలా కామన్‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. టూరిజంలో ఇంతలా మార్పులు వచ్చినప్పటికీ చాలా తక్కువమంది వెళ్తున్న కొన్ని అద్భుతమైన దేశాలు ఇప్పటికీ ఉన్నాయి. ఆ దేశాల్లో చూడదగిన ప్రదేశాలు, ఎన్నో ప్రకృతి అందాలు ఉన్నా.. విజిటర్స్ సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంటోంది. రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టూరిస్ట్‌‌‌‌‌‌‌‌ డెస్టినేషన్స్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే.. ఇవి ఎందులోనూ తీసిపోవు. అడ్వెంచర్​ జర్నీ కోరుకునే వాళ్లకు బెస్ట్‌‌‌‌‌‌‌‌ చాయిస్‌‌‌‌‌‌‌‌ ఇవి. ఆ దేశాలు ఏంటంటే.. 

తువాలు

ఇది పసిఫిక్ మహాసముద్రంలోని ఒక చిన్న ద్వీప దేశం. ప్రపంచంలోనే అతి తక్కువ మంది సందర్శించే దేశాల లిస్ట్‌‌‌‌‌‌‌‌లో ఇదే  మొదటి స్థానంలో ఉంది. ఏడాదికి కేవలం 3,700 మంది టూరిస్ట్‌‌‌‌‌‌‌‌లు మాత్రమే ఇక్కడికి వెళ్తున్నారు. ఈ మారుమూల స్వర్గంలో నేచురల్‌‌‌‌‌‌‌‌ బీచ్‌‌‌‌‌‌‌‌లు, క్రిస్టల్-క్లియర్ వాటర్, ప్రకృతికి దగ్గరగా ఉండే ప్రజల లైఫ్‌‌‌‌‌‌‌‌స్టయిల్‌‌‌‌‌‌‌‌ చూడొచ్చు.

తక్కువమంది వెళ్తుండడం ఒకరకంగా అక్కడి ప్రకృతికి వరమే అయినా... టూరిజం ఆదాయాన్ని కోల్పోవడం వల్ల ఆ దేశానికి శాపంగా కూడా భావిస్తుంటారు. కానీ అదే ఈ ద్వీపాల సహజ సౌందర్యం, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూ వస్తోంది. ఇక్కడ టూరిస్ట్‌‌‌‌‌‌‌‌లు సంప్రదాయ పాలినేషియన్ దీవుల్లో హాస్పిటాలిటీని ఎంజాయ్ చేయొచ్చు. సముద్రజీవులతో నిండిన పగడపు దిబ్బలు ఇక్కడ స్పెషల్‌‌‌‌‌‌‌‌ ఎట్రాక్షన్‌‌‌‌‌‌‌‌.

మార్షల్ దీవులు

పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న మరో అద్భుతం ఇది . ప్రతి ఏడాది ఇక్కడికి సుమారు 6,100 మంది టూరిస్ట్‌‌‌‌‌‌‌‌లు వెళ్తుంటారు. ఇది అటోల్స్(డైవింగ్​ చేసేందుకు అనువైన ప్రదేశం), మెరైన్ బయో డైవర్సిటీకి ప్రసిద్ధి. ముఖ్యంగా డైవర్లు, స్నార్కెలర్లు విజిట్‌‌‌‌‌‌‌‌ చేయడానికి ఇది బెస్ట్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌. ఇక్కడి నీటి అడుగున మునిగిపోయిన ఓడలు, విమానంతో పాటు  రెండో ప్రపంచ యుద్ధం నాటి ఎన్నో అవశేషాలు కనిపిస్తాయి. అందుకే ఇది హిస్టారికల్‌‌‌‌‌‌‌‌ అట్రాక్షన్‌‌‌‌‌‌‌‌గా నిలుస్తోంది. ఎంతో నేచురల్‌‌‌‌‌‌‌‌ బ్యూటీ ఉన్నప్పటికీ ఈ ఐలాండ్స్‌‌‌‌‌‌‌‌లో మౌలిక సదుపాయాలు అంతగా లేకపోవడం వల్ల పర్యాటకుల సంఖ్య తక్కువగా ఉంటోంది. 

కిరిబాటి

ఇక్కడ ఏకంగా 33 అటోల్స్, రీఫ్ ఐల్యాండ్స్‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి. ప్రతి ఏడాది సుమారు12,000 మంది టూరిస్ట్‌‌‌‌‌‌‌‌లు వెళ్తుంటారు. సెంట్రల్ పసిఫిక్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఈ దేశంలో ప్రత్యేకమైన కల్చరల్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియెన్స్‌‌‌‌‌‌‌‌ పొందొచ్చు. సముద్రపు అందాలతోపాటు గిల్బర్ట్,  ఫీనిక్స్,  లైన్ ఐలాండ్స్‌‌‌‌‌‌‌‌లో సంప్రదాయ గ్రామీణ జీవితం కనిపిస్తుంది. అంతేకాదు.. వరల్డ్‌‌‌‌‌‌‌‌ క్లాస్‌‌‌‌‌‌‌‌ ఫిషింగ్‌‌‌‌‌‌‌‌, బర్డ్‌‌‌‌‌‌‌‌ వాచింగ్‌‌‌‌‌‌‌‌కి ఈ దేశం చాలా ఫేమస్‌‌‌‌‌‌‌‌. ఇలాంటి ఇంకెన్నో ఎట్రాక్షన్స్ ఉన్నాయి. రిమోట్ లొకేషన్, లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ ఎయిర్ కనెక్షన్స్‌‌‌‌‌‌‌‌ వల్ల ఇక్కడికి వెళ్లే టూరిస్ట్‌‌‌‌‌‌‌‌ల సంఖ్య తక్కువ. 

మోంట్సెరాట్

మోంట్సెరాట్ ఒక చిన్న కరేబియన్ ద్వీపం. ఏడాదికి దాదాపు 19,300 మంది టూరిస్ట్‌‌‌‌‌‌‌‌లు వెళ్తుంటారు. ఈ బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీ యాక్టివ్‌‌‌‌‌‌‌‌ ఓల్కనో(అగ్నిపర్వతం)కి ప్రసిద్ధి. ముఖ్యంగా ఇక్కడి అగ్ని పర్వతాలు1990ల్లో ఈ ఐలాండ్‌‌‌‌‌‌‌‌లోని పరిస్థితులను పూర్తిగా మార్చేశాయి. వాటివల్ల ఒక యూనిక్‌‌‌‌‌‌‌‌ ల్యాండ్‌‌‌‌‌‌‌‌స్కేప్‌‌‌‌‌‌‌‌గా మారింది. ఒకవైపు చెట్ల పచ్చదనం మరో వైపు దక్షిణ భాగంలో అగ్నిపర్వత బూడిద కనిపిస్తూ పూర్తి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తాయి. మోంట్సెరాట్‌‌‌‌‌‌‌‌లో హైకింగ్, డైవింగ్‌‌‌‌‌‌‌‌తోపాటు ‘పాంపీ ఆఫ్ ది కరేబియన్’ను ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్లోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయొచ్చు. ఇక్కడి అగ్నిపర్వత విస్ఫోటనాల వల్లే టూరిజం అంతగా డెవలప్‌‌‌‌‌‌‌‌ కాలేదు.

నియు

దక్షిణ పసిఫిక్‌‌‌‌‌‌‌‌లోని ఒక చిన్న ద్వీప దేశం నియు. ప్రతి ఏడాది దాదాపు పదివేల మందికి పైగా టూరిస్ట్‌‌‌‌‌‌‌‌లు వెళ్తుంటారు. న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌లో భాగంగా ఉన్నప్పటికీ స్వీయ-పరిపాలన ఉంటుంది. ఇక్కడ కఠినమైన సున్నపురాయి పర్వతాలు, గుహలు స్పెషల్ ఎట్రాక్షన్‌‌‌‌‌‌‌‌. స్నార్కెలింగ్, డైవింగ్‌‌‌‌‌‌‌‌కు అనువుగా ఉంటుంది. ఇక్కడ నీళ్లు క్రిస్టల్​ క్లియర్​గా ఉంటాయి. జనాభా తక్కువగా ఉండడం, పెద్దగా కమర్షియలైజేషన్‌‌‌‌‌‌‌‌ కాకపోవడం వల్ల ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఇక్కడ ఎకో–టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నారు.

మైక్రోనేషియా

ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియాకు ఏటా సుమారు 18,000 టూరిస్ట్‌‌‌‌‌‌‌‌లు వెళ్తుంటారు. ఇది పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో 600 ఐలాండ్స్‌‌‌‌‌‌‌‌తో కూడిన ద్వీపసమూహం. ఇది బ్లూ హోల్, చుక్ లగూన్‌‌‌‌‌‌‌‌లోని జపనీస్ షిప్‌‌‌‌‌‌‌‌రెక్స్ లాంటి డైవింగ్ సైట్స్​కు ప్రసిద్ధి. మైక్రోనేషియా నీటి అడుగు భాగం స్వర్గంలా ఉంటుందని అక్కడివాళ్లు చెప్తుంటారు. ఐలాండ్స్‌‌‌‌‌‌‌‌లో విభిన్న సంస్కృతులు, ఆకుపచ్చని ప్రకృతి, చారిత్రక ప్రదేశాలు మంచి ట్రావెల్​ ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియెన్స్‌‌‌‌‌‌‌‌ని ఇస్తాయి. మైక్రోనేషియాకు వేరే దేశాల నుంచి వెళ్లేందుకు భూమ్మీద, నీటిలో కనెక్షన్స్​ తక్కువగా ఉంటాయి. అందుకే తక్కువ మంది వెళ్తుంటారు ఇక్కడికి.