వావ్ : మెరుస్తున్న పుట్టగొడుగులు.. చూడాలంటే అక్కడకు వెళ్లాల్సిందే..

పుట్టగొడుగులు ఒక ఆహారంగానే చాలామందికి తెలుసు. ఇవి పర్యాటకులను కూడా ఆకర్షించే శక్తి ఉన్నవి. సాధారణ పుట్టగొడుగులను చూడడానికి ఎవరూ రారు, కానీ ఆ పుట్టగొడుగులు మెరుస్తూ కనిపిస్తే కచ్చితంగా వాటిని చూసేందుకు ఎంతో మంది వస్తారు. అలాంటి మెరుస్తున్న పుట్టగొడుగులు మనదేశంలోనే ఉన్నాయి. వాటిని సహజమైన టార్చ్ లైట్లుగా స్థానికులు భావిస్తారు. రాత్రిపూట అడవిలో వాటి వెలుతురులోనే ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి మిలమిల మెరిసే పుట్టగొడుగులు ఉన్నది కర్నాటక  అడవుల్లో( ఉత్తర కన్నడ). ఈ పుట్టగొడుగులకు బయోలుమినిసెన్స్ లక్షణం ఉంది. అంటే స్వయంగా వెలిగే శక్తిని కలిగి ఉన్నాయి.

ఉత్తర కన్నడలోని పల్లెటూళ్లలో నదీతీరంలో కప్పలు, చేపలు పట్టి పట్టే చేపలు, దట్టమైన అడవిలో చెట్లకింద వ్యాపించే పుట్టగొడుగులు సందర్శకులను కట్టిపడేస్తాయి. తాజాగా ఓ ఫోటోగ్రాఫర్ గోపి జాలీ తన కెమెరాలో అరుదైన పుట్టగొడుగును బంధించారు. అడవిలో  కొన్ని జాతుల  పుట్టగొడుగులు చాలా విచిత్రంగా కనువిందు చేస్తాయి.   తడిగా ఉండే, కఠినమైన వాతావరణాల్లో పెరుగుతాయి, కొన్నిసార్లు విషపూరిత పదార్థాలను వెదజల్లుతూ విస్తారమైన ఆకారాలు.. వివిధ రంగుల్లో కనిపిస్తాయి   అత్యంత ఆకర్షణీయమైన లక్షణాలతో మెరుస్తూ ఉంటాయి.  70 రకాల శిలీంధ్రాలు చీకటిలో కాంతిని విడుదల చేస్తయి, ఇవి సాధారణంగా గుర్తించలేని జీవులను ఆకర్షణీయంగా ఉంటాయి.

బయోలుమినిసెంట్ పుట్టగొడుగులు  జీవరసాయన ప్రక్రియ ద్వారా కాంతిని ఉత్పత్తి చేసే శిలీంధ్రాలున్న  వివిధ జాతుల పుట్టగొడుగులు.  . ఉత్తర కన్నడ అడవులు అయస్కాంతంలా దూర ప్రాంతాల ప్రజలను  కాంతితో ఆకర్షిస్తాయి.   ఈ పుట్టగొడుగులను పగటిపూట సాధారణ పుట్టగొడుగుల్లాగా గుర్తించడం కష్టం. వీటి గురించి తెలిసిన వారు మాత్రమే గుర్తించగలరు.  లూసిఫేరేస్ అనే ఎంజైమ్ పుట్టగొడుగులు, తుమ్మెదలు మరియు కొన్ని సముద్ర జీవులతో సహా వివిధ రకాల జీవులలో బయోలుమినిసెన్స్‌కు బాధ్యత వహిస్తుంది.  ఈ ఎంజైమ్ ఆక్సిజన్ సమక్షంలో ఆక్సీకరణం చెంది కాంతి రూపంలో శక్తిని విడుదల చేస్తుంది. పుట్టగొడుగులు విడుదల చేసే కాంతి సాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉంటుంది. పుట్టగొడుగులలోని బయోలుమినిసెన్స్ వివిధ రకాల సహజ విధులను నిర్వహిస్తుంది. ఇది కీటకాలను ఆకర్షించగలదు, ఇది పుట్టగొడుగుల బీజాంశం వ్యాప్తికి కూడా సహాయపడుతుంది.

ఈ ప్రదేశంలో కనిపెట్టిన పుట్టగొడుగులను ప్రపంచంలో ఇప్పటివరకు కనిపెట్టిన పుట్టగొడుగుల్లో 97వ బయోలుమినిసెంట్ శిలీంధ్రాలుగా గుర్తించారు.రుతుపవనాల సమయంలో శాస్త్రవేత్తల బృందం ఆ ప్రాంతంలో పర్యటించింది. రెండు వారాలు పాటు పరిశోధించి అక్కడి పుట్టగొడుగులను పరిశీలించింది. ఇక్కడ వారు వందలాది జాతుల పుట్టగొడుగులను గుర్తించారు. అవి సైన్స్‌కు కూడా చాలా కొత్తవి. అక్కడి స్థానికులు వీటిని ఎలక్ట్రిక్ పుట్టగొడుగులు అని పిలుస్తారు. చీకట్లో చిన్న చిన్న దీపాల్లా పుట్టగొడుగులు ఎంతో అందంగా మెరుస్తూ ఉంటాయి. ఆకుపచ్చని వెలుగుతో కనుల విందు చేస్తాయి. ఈ ఫంగస్ తన నుండి సొంత కాంతిని విడుదల చేస్తుంది. ఇది చూడాలంటే అక్కడికి వెళ్లి తరించాల్సిందే. పరిశోధకుల పర్యటన తర్వాత ఈ పుట్టగొడుగులను రోరీడోమైసెస్ జాతికి చెందిన పుట్టగొడుగులుగా గుర్తించారు. ఇవి మన దేశంలో మొదటిసారి గుర్తించినట్టు చెప్పారు శాస్త్రవేత్తలు.

ప్రపంచవ్యాప్తంగా 20వేల శిలీంధ్ర జాతులు ఉంటే, అందులో 70 రకాల  పుట్టగొడుగులు మాత్రమే శక్తిని కలిగి ఉంటాయి. ఇవి తమ నుంచి కాంతిని విడుదల చేయగలవు. అలాంటివే మేఘాలయ అడవుల్లోపరుచుకొని ఉన్నాయి.  ఈస్ట్ ఖాసీ హిల్స్ జిల్లాలోని మావ్లిన్నాంగ ప్రాంతంలో నీటి ప్రవాహానికి దగ్గరలో ఈ మెరిసే పుట్టగొడుగులను మొదటిసారి కనుగొన్నారు. అలాగే వెస్ట్ జైంతియా హిల్స్ జిల్లాలోని క్రాంగ్ షూరి జిల్లాలో అదే రకమైన పుట్టగొడుగులను స్థానికులు గమనించారు. అప్పటినుంచి ఆ ప్రాంతం చాలా హైలెట్ అయింది