ఈ లిటిల్ ఆక్టోపస్ క్యూట్​గుంది కానీ.. చాలా డేంజర్

బాలి: చూడటానికి భలే క్యూట్ గా ఉన్న ఈ లిటిల్ ఆక్టోపస్.. ముట్టుకుంటే మాత్రం చాలా డేంజరట. ఇది ఒక్కసారి కాటు వేస్తే చిమ్మే విషం ఏకంగా 20 మందిని చంపేసేంత పవర్ ఫుల్ గా ఉంటుందట!  

ఇండోనేసియాలోని బాలిలో ఇటీవల ఓ టూరిస్టు దీనితో ఆడుకుంటూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా,  వైరల్ అయింది. అయితే, ఇది చాలా డేంజర్ అని ఇలాంటి వాటి జోలికి వెళ్లరాదంటూ సైంటిస్టులు హెచ్చరించారు. కేవలం 12 నుంచి 20 సెంటీమీటర్ల పొడవు మాత్రమే పెరిగే  బ్లూ రింగ్డ్ ఆక్టోపస్ అనే ఈ బుజ్జి ప్రాణి విషం సైనైడ్ కంటే వెయ్యి రెట్లు ప్రాణాంతకమట.

ఒక్కసారి కాటువేసినప్పుడు ఇది ఎగజిమ్మే టెట్రోడోటాక్సిన్ అనే న్యూరోటాక్సిన్ రకానికి చెందిన విషం 20 మంది ప్రాణాలను తీయగలదట. పసిఫిక్, హిందూ మహాసముద్రాలలోని టైడ్ పూల్స్, నిస్సారమైన దిబ్బలలో ఇది కనిపిస్తుంది. ఇవి పసుపు లేదా ఇసుక రంగులో ఉంటాయి. కానీ ప్రమాదం ఎదురైనప్పుడు   నీలిరంగు వలయాల్లోకి మారి  కాటేస్తాయి. ఇవి కరిచాయంటే ఇక ఎలాంటి జీవి అయినా హరీమనాల్సిందే!