అమెరికా, ఇండియాల మధ్య టైం డిఫరెన్స్ ఇదే.. US ప్రెసిడెంట్ పోలింగ్ వివరాలు

అగ్రదేశం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమయం రానే వచ్చాయి. ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తికరంగా గమనిస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ నవంబర్ 5న జరగనుంది. అమెరికన్ టైమింగ్ ప్రకారం.. నవంబర్ 5 ఉదయం 6 నుంచి 8 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అమెరికా, భారత్ కాలమానానికి 10గంటల 30 నిమిషాల తేడా ఉంటుంది. మన కంటే అమెరికన్లు దాదాపు 10గంటలు వెనక్కి ఉంటారు. అమెరికాలో ఆరు కాలమండలాలు ఉన్నాయి. (ఇండియన్ టైం ప్రకారం.. నవంబర్ 5 రాత్రి 9 గంటలకు అమెరికన్లు పోలింగ్ బూత్‌లకు తరలివెళ్లనున్నారు.) అమెరికాలో నేడు జరిగేవి 60వ అధ్యక్ష ఎన్నికలు. 

దేశంలో మొత్తం 230 మిలియన్ల మంది ఓటర్లు ఉండగా అందులో 160 మిలియన్ల మంది (సుమారు 16 కోట్లు) మాత్రమే ఈసారి ఓటు కోసం పేరు నమోదు చేసుకున్నారు. ఇక 70 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఓటర్లు ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్లు లేదా ముందస్తు పోలింగ్ స్టేషన్ల ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ అయిపోయిన వెంటనే ఫలితాలు కూడా వెల్లడించనున్నారు. అన్ని రాష్ట్రాల్లో కౌంటింగ్ ముగిసిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ కూడా మొదలవుతుంది. చిన్న రాష్ట్రాలలో ముందుగానే ఫలితాలు వెలువడతాయి. 

Also Read :- అమెరికా బ్యాలెట్ పేపర్లో భారతీయ భాష

రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, డెమెక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ లు బరి ఉన్నారు. అమెరికా ప్రజలు తీర్పు ఎలా ఉన్నా అమెరికాతో భారత్ బంధం ఇంకా బలపడుతుందని నవంబర్ 5న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ అన్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నిక పరోక్ష ఎన్నిక. అమెరికా అధ్యక్షుడిని నిర్ణయించేది ఎలక్టోరల్‌ కాలేజీ ప్రతినిధులు మాత్రమే. అన్ని రాష్ట్రాల్లో కలిపి మొత్తం 538 ఎలక్టోరల్‌ కాలేజీ సీట్లున్నాయి. ఇందులో 270 సీట్లు వచ్చిన వారే అధ్యక్షులవుతారు. ఎలక్ట్రోరల్‌ కాలేజీలో సమాన ఓట్లు వస్తే అమెరికా దేశ దిగువ సభ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నది. అమెరికా కొత్త అధ్యక్షుడు 2025 జనవరి 20న ప్రమాణ స్వీకారం చేస్తారు.