జగిత్యాలలో 4 తులాల బంగారం చోరీ చేసిన దొంగలు 

జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల పట్టణంలోని శివాజీవాడలో దొంగలు రెచ్చిపోయారు. శివాజీవాడకు చెందిన తోట ప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటికి తాళం వేసి పండుగ సెలవులకు కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెళ్లాడు. బుధవారం అర్ధరాత్రి దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు.

బీరువా పగలగొట్టి 4 తులాల బంగారంతోపాటు రూ.30వేల నగదు ఎత్తుకెళ్లారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ప్రసాద్ జగిత్యాల చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.