పవన్ కల్యాణ్ కొండగట్టు పర్యటనలో దొంగల చేతివాటం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టును ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం దర్శించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన్ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు. ఈనేపథ్యంలో ఆ పరిసరాల్లో తీవ్ర రద్దీ ఏర్పడింది. ఇదే అదనుగా భావించిన కొందరు దుండగులు.. వారి చేతివాటాన్ని ప్రదర్శించారు. చైన్, డబ్బులు దొంగిలించారు. పరిసరాల్లో అనుమానస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని పట్టుకుని చితకబాదారు.  . దొంగ వద్ద రూపాయలు ఐదువేలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నరు. మరో దొంగను పోలీసులకు అప్పగించారు భక్తులు.   ఈ రోజు ఉదయం హైదరాబాద్‌ నుంచి కొండగట్టుకు బయలుదేరిన పవన్‌ కల్యాణ్ కు జనసైనికులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.  అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  వారాహి విజయ యాత్రకు ముందు వారాహి వాహనానికి కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించి ముడుపులు కట్టారు పవన్.