సింగరేణిలో లోకల్‌ లొల్లి .. ఓబీ కంపెనీలో 80 శాతం కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

  • ఐదు రోజులు ఆందోళన చేస్తున్న స్థానిక నిరుద్యోగులు
  • జీడీకే ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 5లో నిలిచిన మట్టి తొలగింపు, బొగ్గు ఉత్పత్తి
  • మరో రెండు రోజులు కొనసాగితే పలు విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాంట్లకు నిలిచిపోనున్న బొగ్గు సరఫరా

గోదావరిఖని, వెలుగు : సింగరేణి ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో బొగ్గుపై ఉండే మట్టి (ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బర్డెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) తొలగింపు పనులు నిర్వహించే కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థలో ‘స్థానిక’ లొల్లి రోజురోజుకు తీవ్రం అవుతుంది. సంస్థలో స్థానిక నిరుద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వకుండా బీహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మధ్యప్రదేశ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి యువకులను తీసుకొచ్చి పనులు చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలంటూ గత ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ కారణంగా ఓసీపీ 5లో మట్టి తొలగింపు పనులు బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. దీంతో ప్రతి రోజు 80 వేల క్యూబిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటర్ల మట్టి, ఎనిమిది వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడింది.

స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని  గతేడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 18న సర్క్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

సింగరేణి వ్యాప్తంగా ఉన్న 19 ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో నాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోకల్సే ఎక్కువగా పనిచేస్తున్నారు. అన్ని ఓసీపీలు కలిపి వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులు సుమారు 12 వేల మంది ఉన్నారు. కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో వీరికి తాత్కాలిక నివాసం కల్పించి డ్యూటీ చేయిస్తున్నారు. ఓసీపీలలో పనిచేసే మొత్తం కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్మికుల్లో స్థానికులు 20 శాతం మాత్రమే ఉంటారు.

 అలాగే జైపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన ఇంజినీర్లు, హెల్పర్లు డ్యూటీ చేస్తున్నారు. వీరి వల్ల స్థానిక యువకులకు ఉద్యోగావకాశాలు లేకుండా పోయాయని పలువురు మండిపడుతున్నారు. దీంతో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పించాలని 2023 డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 18న సింగరేణి మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్క్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జారీ చేసింది. సింగరేణి ప్రభావిత, పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండే స్థానికులకు, సంస్థ కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని సర్క్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు. 

సర్క్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమలు చేయాలని ఆందోళన

సింగరేణి రామగుండం రీజియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలోని జీడీకే ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 5 ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మట్టి తొలగింపు పనులను పీసీ పటేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థ చేస్తోంది. ఈ కంపెనీ అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మరో నాలుగు నెలల్లో ముగియనుంది. అయితే మరో మూడేళ్ల పాటు మట్టి తొలగింపు పనులకు టెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించగా ఆ కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఇదే సంస్థకు దక్కింది. ఈ కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీలో ప్రస్తుతం 1,100 మంది పనిచేస్తుండగా ఇందులో 200 మంది మాత్రమే సింగరేణి నిర్వాసిత ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులు ఉన్నారు. మిగిలిన 900 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే. 

ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని తీసుకొచ్చి ఇప్పటికే తమ పొట్ట కొట్టారని, రాబోయే టెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా వారితోనే పనులు చేయించేందుకు కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీ చూస్తోందంటూ స్థానిక నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. సింగరేణి ఇచ్చిన సర్క్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అమలు చేసి సింగరేణి ప్రభావిత, పరిసర ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులను ఉద్యోగాల్లోకి తీసుకోవాలంటూ  డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  చేస్తున్నారు.

నిలిచిన మట్టి తొలగింపు, బొగ్గు ఉత్పత్తి

స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని, అప్పటివరకు పనులు బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని నిరుద్యోగులు కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థ సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో సదరు కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థ శనివారం 34 మందిని, ఆదివారం 50 మందిని వారి సొంత ప్రాంతాలకు పంపించివేసింది. మిగిలిన వారందరినీ పంపించే వరకు ఆందోళన కొనసాగిస్తామని నిరుద్యోగులు స్పష్టం చేశారు. ఈ కారణంగా ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో మట్టి తొలగింపు పనులు బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. వందలాది డంపర్లు, డోజర్లు, షవల్స్, వోల్వో వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 

ప్రతి రోజు 80 వేల క్యూబిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటర్ల మట్టి తొలగింపు, ఎనిమిది వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడింది. ఈ ఆందోళన ఇలాగే కొనసాగితే రెండు రోజుల తర్వాత నుంచి తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన జెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కో విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాంట్లకు గోదావరిఖని సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీ నుంచి బొగ్గు రవాణా నిలిచిపోనుంది.