రాఖీ పండుగ.. రక్షా బంధన్ వచ్చిందంటే చాలు.. Brothers & Sisiters సంబరాలు చేసుకుంటారు. సోదరులు రక్షా బంధన్ ద్వారా భరోసా ఇచ్చే ఈ పండుగను భారత్ లోని కొన్ని గ్రామాల్లో జరుపుకోరు అంటే ఆశ్చర్యం కలుగుతుంది. అలా జరుపుకోకపోవటానికి బలమైన కారణాలున్నాయంటారు ఆ గ్రామాల ప్రజలు. దీని వెనుక ఒక్కో ఊరిది ఒక్కో కథ ఉందని చరిత్ర ద్వారా తెలుస్తోంది.. ఏఏ గ్రామాల్లో రాఖీ పండుగకు దూరంగా ఉంటారు.. దానికి గల కారణాల గురించి తెలుసుకుందాం, , ,
హిందువులకు ఈ రాఖీ పండుగ చాలా చాలా ప్రధానమైనది. . ఈ పండుగ వస్తే ప్రతీ ఇంట్లోనూ సందడి నెల కొంటుంది. దూర ప్రయాణాలను సైతం లెక్క చేయకుండా.. రాఖీ కట్టేందుకు అన్నా, తమ్ముళ్ల ఇంటికి చేరుకుంటారు సోదరీమణులు. . కానీ ఓ గ్రామంలో మాత్రం రాఖీ పండుగను 65 సంవత్సరాలుగా జరుపుకోవట్లేదట. ఒకవేళ పొరపాటున చేసినా.. ఆ ఊర్లో శవాలు లేస్తాయని ఆ గ్రామస్తులు పేర్కొంటున్నారు.
65 సంత్సరాలుగా రాఖీ పండుగ జరుపుకోని గ్రామం
ఉత్తర ప్రదేశ్‌లోని వజీరాగంజ్ పంచాయతీలోని జగత్‌పూర్వలో రక్షా బంధన్‌ని గత 65 సంవత్సరాలుగా జరుపుకోవట్లేదు. రాఖీ పండుగ జరుపుకుంటే అనర్థాలు జరుగుతాయని వారి నమ్మకం. రాఖీ కట్టడానికి గడప దాటి వెళ్తే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని వారి భయపడుతుంటారు. దీనికి కారణం కూడా ఉందని చరిత్రను పరిశీలిస్తే అర్దమవుతుంది. 1955లో రాఖీ పండుగ రోజు ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అది కీడుకు సంకేతమని భావించి రాఖీ పండుగను చేసుకోవడం మానేశారు ఆ గ్రామస్తులు. అయితే దశాబ్దం కిందట ఊర్లో రాఖీ వేడుక జరపాలని నిర్ణయించుకున్నాం. కానీ తర్వాతి రోజు ఉదయం ఆ ఊర్లో అలాంటి అవాంఛనీయ ఘటనే మరొకటి జరిగింది. దీంతో రాఖీ పండుగ జరపడం తమ ఊరికి, ప్రజలకు మంచిది కాదనే నిర్ణయానికి వచ్చారు. దీంతో ఇప్పటికీ జగత్‌పూర్వలో ఎవరూ రక్షా బంధన్‌ని చేసుకోరు.
మహ్మద్ ఘోరీ దండయాత్ర.. సురానా గ్రామానికి రాఖీ పండుగ శాపం
ఉత్తరప్రదేశ్.. మీరట్ లో సురానా (Surana) అనే గ్రామంలో కూడా రక్షా బంధన్ జరుపుకోరు. 12వ శతాబ్దంలో రాఖీ పండుగ రోజున మహ్మద్ ఘోరీ (Muhammad Ghori) ఆ గ్రామంపై దండెత్తాడు. ఆ గ్రామంలో అందరిని చంపేశాడట. అయితే కేవలం ఒకే ఒక్క మహిళ ఆమె ఇద్దరు మగ పిల్లలు బతికి బయటపడ్డారట. ఎందుకంటే ఆరోజు వారు ముగ్గురు ఆ ఊర్లో లేకపోవటంతో బతికి ఉన్నారు.
మహ్మద్ ఘోరీ దండయాత్ర నుంచి తప్పించుకున్న మహిళ చబ్బయ్య గోత్రానికి చెందిన మహిళ. ఆమె ఇద్దరు కుమారులు లఖన్,చూండా అనే వారున్నారు. ఊరు ఊరంతా చనిపోగా భయపడినవారు కొంతకాలం చుట్టు పక్కల గ్రామాలు తిరుగుతు కాలం వెళ్లదీశారు. అలా కొంతకాలానికి తమ ఊరు చేరుకున్నారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. తరువాత రాఖీ పండుగ రోజు సంబరాలకు సిద్ధమైన వారు.. అన్నీ సిద్ధం చేసుకోగా ఆ ఇద్దరిలో ఒకపిల్లాడు దివ్యాంగుడి (physically challenged)గా మారిపోయాడట. దాంతో అప్పుడు ఆగ్రామంలో ఉన్న ప్రజలు భయపడ్డారు. సురానా గ్రామానికి మహ్మద్ ఘోరీ శాపం వెంటాడుతోందని భావించారు. ఆ నమ్మకం బలపడింది. దీంతో రాఖీ పండుగ చేసుకునేది లేదని నిర్ణయించుకున్నారు. అలా రాఖీ పండుగకు శాశ్వతంగా స్వస్తి పలికారు. అప్పటి నుంచి అక్కడ రాఖీ పండుగ జరుపుకోవటంలేదని స్థానికులు చెబుతున్నారు. అసలు ఆ ధైర్యం కూడా ఎవ్వరు చేయటంలేదట.
ఘోరీ దండయాత్ర నుంచి తప్పించుకున్నవారే క్రమేపీ వృద్ధి చెందారు.100మందిగా పెరిగారు. అలా ఆ గ్రామంలో నేటికీ 50శాతం మంది చబ్బయ్య యాదవులే ఉన్నారు. ఆ గ్రామం పేరు సోహ్రానా (100 రాణాలు)గా మార్చబడింది. అది తరువాత కాల క్రమంలో సురానా గ్రామంగా మారింది.
రాఖీ కట్టించుకున్నారు.. బికారులుగా మారారు..
ఉత్తరప్రదేశ్ లోనే సంభాల్ జిల్లాలో బైనిపూర్ చాక్ (Bainipur Chak) గ్రామానిది మరో వింత కథ. రాఖీ పండుగ జరుపుకోని మరో గ్రామం. రక్షా బంధన్ రోజు రాఖీ కట్టాక..సోదరులు డబ్బులు లేదా మరో బహుమతి ఇస్తారు. అలా బైనిపూర్ చాక్ గ్రామంలో సోదరులకు రాఖీ కట్టాక సోదరీమణులు… వారి ఆస్తిని ఇమ్మని కోరితే..సోదరులు ఆ ఆస్తిని ఇచ్చి సోదరులు గ్రామాన్ని వదిలి వెళ్లిపోయారు. అలా ఆస్తి అంతా ఇచ్చి వారు బికారులుగా అయ్యారు. ఇక అప్పటి నుంచి ఆ గ్రామంలో కూడా రాఖీ పండుగే జరుపుకోకూడదని నిర్ణయించుకున్నారు. ఆ భయంతోనే 300 ఏళ్లుగా ఈ రాఖీకి రాం రాం పలికారు. ఇది కేవలం భయంతో పండుగ మానేయటం కాదు దానికి నిజంగానే ఓ ఘటన జరిగిందట..
ఎనిమిదవ శతాబ్దంలో బైనిపూర్ చాక్ గ్రామంలో ఓ జమిందార్ ఉండేవాడట. అతనికి కొడుకులు తప్ప కూతుళ్లు లేరు. కూతురు కావాలని జమిందారు... అతని కొడుకు పెద్ద మనస్సుతో కులం కూడా పట్టించుకోకుండా ఆ ప్రాంతంలోని పేద అమ్మాయిలను తీసుకొచ్చి వారితో రక్షా బంధన్ పండుగ రోజు రాఖీలు కట్టించుకున్నారు. ఆ పేద అమ్మాయిలకు బహుమతిగా ఏమి కావాలో కోరుకోమన్నారట. అప్పుడు ఆ అమ్మాయి జమిందారు ఆస్తికే ఎసరు పెట్టారు. బహుమతిగా జమిందార్ ఆస్తి మొత్తం ఇవ్వాలని కోరారు. అంతేకాదు ... కోరింది ఇవ్వకపోతే మీ వంశానికే మచ్చ అంటూ ఎమోషనల్ గా కూడా చెప్పేసరికి ... జమిందారు కొడుకులు వాళ్లు అడిగింది ఇస్తామని వాగ్ధానం చేశారు.
అలా కొడుకుల చేతులకు రాఖీలను చూసిన జమిందార్ పేద అమ్మాయిలు కదా వారికి బహుమతిగా ఏమిచ్చారు? అని కొడుకుల్ని అడిగాడు.దానికి వారు ఆస్తిని అడిగారని చెప్పుకొచ్చారు. దీంతో జమిందారు కొడుకుల్ని మందలించాడు. కానీ కోరి తామే తీసుకొచ్చి కట్టించుకున్నాం..పైగా మాట కూడా ఇచ్చాం అని.. ఇంకా రాఖీ పండుగకు విలువ ఇస్తూ… ఇచ్చిన మాట నిలబెట్టుకుని మొత్తం ఆస్తి ఆ పేద అమ్మాయిలకు ఇచ్చి జమిందారు కుటుంబం అంతా ఊరు విడిచి వెళ్లిపోయిందట. అందువల్ల అప్పటి నుంచి స్థానికులు ఈ పండుగ జరుపుకోవట్లేదు.
గున్నార్ గ్రామంలో రాఖీ కడితే ఏం జరిగిందంటే...
ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ జిల్లాలోనే గున్నార్ ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో రాఖీ జరుపుకోరు. దీనికి కూడా ఓ బలమైన కారణం ఉంది. దాదాపు 20 ఏళ్ల క్రితం ఓ యువతి తన సోదరుడికి రాఖీ కట్టింది. రాఖీ కట్టిన కొన్ని గంటలకే ఆమె సోదరుడు చనిపోయాడు. అంతే రాఖీ పండుగ వల్లే ఈ ఘోరం జరిగిందని నమ్మి ఈనాటికీ రాఖీ చేసుకోవటం లేదు. తరువాత తరువాత ఇదంతా మూఢనమ్మకం అంటూ కొంతమంది మళ్లీ రాఖీ పండుగ చేసుకోవటం ప్రారంభించారు. కొంతమంది ఆడవాళ్లు తమ సోదరులకు రాఖీ కట్టారు. కానీ రక్షా బంధన్ రోజునే… ప్రమాదం జరిగి వారిలో చాలామంది మగవారు ప్రాణాలు కోల్పోయారు. అలా రాఖీ పండుగే పెద్ద శాపంగా మారింది ఆ ప్రాంతంలోని గ్రామాలకు. అంతే ఇక అప్పటి నుంచి రాఖీ పండుగ పేరు చెబితే హడలిపోతారు. గోండా జిల్లాలోని బికంపూర్ జగత్ పూర్వా అనే గ్రామంతో పాటు ఉత్తరప్రదేశ్ లోని చాలా గ్రామాల్లో రాఖీ పండుగ జరుపుకోరు.
సంతాప దినాలుగా..
ఉత్తరప్రదేశ్ లోని ధౌలానా అనే గ్రామంలో సాథా అనే ప్రాంతంతో పాటు ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా రాఖీ పండుగ వేడుకలను జరుపుకోరట. ఎందుకంటే తాము మహారాణా ప్రతాప్ వారసులమని చెప్పుకునే వీరు.. రాఖీ పండుగ రోజునే యుద్ధంలో తమ రాజు ఓడిపోయారని, ఆ సమయంలో చాలా మంది చనిపోయారని అందుకే ఇక్కడి ప్రజలు రాఖీ పౌర్ణమిని సంతాప దినంగా భావిస్తారు. రక్షా బంధన్ వేడుకలకు దూరంగా ఉంటారు...