Lifestyle: జీవితంలో అనుకున్నది సాధించాలంటే.. వీరిలాగా ఉండాలి..


తింటే గారెలే తినాలి.. వింటే భారతమే వినాలి' అనే నానుడి ఊరికే పుట్టలేదు. ఎందుకంటే జీవితానికి కావాల్సిన పాఠాలన్నీ భారతంలో ఉన్నాయి. భారతంలో లేని కథ ప్రపంచంలో లేదు. ప్రపంచంలో ఉన్న ప్రతీ కథ భారతంలో. ఉంది. మహాభారతం ప్రాచీన గ్రంథమే అయినా.. ఇప్పుడు చదివినా దాని మహిమ అర్ధమవుతుంది. ఒక్కో పాత్ర.. ఒక్కో నీతిని వివరిస్తుంది.అవి చాలు జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి...

జీవితంలో గెలవడానికి జాలి, దయ. మంచితనం మాత్రమే ఉంటే చాలదు. కర్ణుడు మంచితనానికి, దాన, ధర్మాలకి పెట్టింది పేరు. కానీ ఆయన సమయాన్ని బట్టి నడుచుకోలేదు. చెడు (కౌరవుల) వైపు నీలబడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కాబట్టి, జీవితంలో విజయం సాధించాలంటే.. మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజాన్ని పరిశీలిస్తూ. సమయాన్ని బట్టి నడుచుకోవాలి స్నేహం ఊహించని విధంగా జీవితాన్ని నాశనం.. చేస్తుంది.

ALSO READ | దుఃఖం ఎలా తీరుతుంది.. గౌతమ బుద్దుడు చెప్పిన  ఏంచెప్పాడంటే 

కౌరవ సామ్రాజ్యల మొత్తం నాశనం అవడానికి కారణం శకుని వాళ్లతో స్నేహంగా వాళ్ల అస్థానంలోనే ఉంటూ కౌరవులు కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు. శకుని లాంటి వాళ్లు చాలామంది మన జీవితంలోకి స్నేహితుల రూపంలో వస్తూ ఉంటారు. వాళ్లని తెలివిగా దూరంగా పెట్టాలి.

నిజమైన స్నేహం : ఎలాంటి భేదాలు చూడని నిజమైన స్నేహం జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. పాండవులు శ్రీ కృష్ణుడిని, కౌరవులు కర్ణుడిని స్నేహితులుగా పొందారు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో వాళ్ల స్నేహం ఎంతటి సాయం చేసిందో తెలుసు కదా! కర్ణుడి లేని కౌరవుల బలం ఏ పాటిది? కౌరవ సైన్యానికి కర్ణుడే  ధైర్యం. కుల, మత, పేద భేదాలని చూడకుండా  మంచివాళ్లతో స్నేహం చేసేవాళ్లు కచ్చితంగా జీవితంలో రాణిస్తారు.

అధికం..అనర్థం: అతి ఎప్పుడూ ప్రమాదకారే! కౌరవుల తల్లి గాంధారి తన వంద మంది కొడుకులను పెంచడానికి ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. ఎక్కువమంది బిడ్డలున్నప్పుడు ఆస్తుల్ని సమానంగా పంచటం, వాళ్ల బాగోగులు చూడటం, క్రమశిక్షణతో పెంచటం కూడా చాలా కష్టం.దుర్యోధనుడికి కోపమెక్కువ. అతనికి ఉన్న  రాజ్యకాంక్ష వల్ల అతనితోపాటు కౌరవులంతా నాశనం అయ్యారు. కాబట్టి అన్నిచోట్ల.. ముఖ్యంగా చెడు వైపు అతి అనేది ప్రమాదకరం.

ఎవరి పనులు వాళ్లే: ఎవరి పనులు వాళ్లు చేసుకున్నప్పుడే మీతో పాటు, మీతో ఉన్నవాళ్లు కూడా సంతోషంగా ఉంటారు. మీరు నేర్చుకున్న పసులు ఎక్కడో ఒక చోట ఉపయోగపడతాయి. అరణ్యవాసం, అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకి వాళ్ళు నేర్చుకున్న ఇంటి. వంట పనులు తర్వాత చాలా ఉపయోగపడ్డాయి. కాబట్టి, మనం కూడా మన కోసమైనా కొన్ని పసులు నేర్చుకోవాలి.

మహాభారతం మనకు కనువిప్పు కలిగిస్తుంది. ధృతరాష్ట్రుడు అటు బిడ్డల మీద ప్రేమ ఇటుతాను నమ్ముకున్న సిద్ధాంతాల మధ్య నలిగిపోయాడు. కొడుకుల వినాశనం మొత్తం తనకు తెలుస్తున్నా వాళ్ల తప్పులని ఆపలేకపోయాడు. అదే దృతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమని. పెంచుకోకుండా వాళ్లని క్రమశిక్షణతో పెంచితే. విషయం అంత వరకూ వెళ్ళేది కానేమో! ఎవరి మీదైనా అతి ప్రేమ. అతి నమ్మకం వినాశనానికి దారితీస్తుంది.

కష్టమైనా పోరాడాలి: మనకు సంబంధించిన దాని కోసం ఎంత కష్టమైనా పోరాడాలి. కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువ అయినా పాండవులు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని పోరాటం చేశారు. విజేతలుగా నిలిచారు. సంకల్పం బలంగా ఉన్నప్పుడు శత్రువుల సంఖ్య ఏమీ చేయలేదు..

అతి ప్రేమతో.... ఇక అతి ప్రేమ కూడా నష్టం కలిగిస్తుందని మహాభారతం మనకు కనువిప్పు కలిగిస్తుంది.  ధృతరాష్ట్రుడు అటు బిడ్డల మీద ప్రేమ ... ఇటుతాను నమ్ముకున్న సిద్ధాంతాల మధ్య నలిగిపోయాడు. కొడుకుల వినాశనం మొత్తం తనకు తెలుస్తున్నా వాళ్ల తప్పులని ఆపలేకపోయాడు. అదే దృతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమని పెంచుకోకుండా వాళ్లని క్రమశిక్షణతో పెంచితే. విషయం అంత వరకూ వెళ్ళేది కాదేమో! ఎవరి మీదైనా అతి ప్రేమ. అతి నమ్మకం వినాశనానికి దారితీస్తుంది.

జీవితాంతం నేర్చుకోవాలి: అది ఏ విద్య అయినా కావొచ్చు కానీ, దాన్ని జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలి. ఒకవేళ నేర్చుకోవడం ఆపేస్తే ఆ రంగంలో మీరు నిపుణులు కాలేరు అంటే, జీవితాంతం నేర్చుకోవటమే మనకు మనమిచ్చుకునే ఉత్తమ బహుమతి! అర్జునుడు జీవితాంతం విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు. ద్రోణాచార్యుడి నుంచి యుద్ధ విద్యలు, ఇంద్రుని నుంచి ఆయుధాల ప్రయోగం, మహదేవుడి నుంచి పాశుపతాస్త్రం. యుధిష్టరుడు నుంచి రాజ నీతులు చివరకు కురుక్షేత యుద్ధం జరుగుతున్నప్పుడు కృష్ణుడి నుంచి జీవిత పాఠాలు (భగవద్గీత) కూడా నేర్చుకున్నాడు.. ఇలా ప్రతి దశలోనూ ఏదో ఒకటి నేర్చుకోవడం వల్లే అర్జునుడికి భారతంలో ప్రత్యేక స్థానం దక్కింది. నిత్యం నేర్చుకోవడం వల్ల కచ్చితంగా విజయం వరిస్తుంది.

అర్జజ్ఞానం ప్రమాదకరం: కొంచెం తెలిసినా అంతా తెలిసినట్లు ప్రవర్తిస్తారు కొంతమంది. ఏం తెలియని వాళ్ల కన్నా సగం నగం తెలిసిన వాళ్లే ఎక్కువ కష్టాలు పడతారు. పద్మహ్యహంలోకి ప్రవేశించటమే కానీ బయటపడటం తెలియక.. తనకున్న అర్థ జ్ఞానంతో అభిమన్యుడు లాంటి మహావీరుడే. నేల రాలిపోయాడు. అందుకే ఏపనైనా.. దాని గురించి పూర్తిగా తెలుసుకున్నాకే మొదలు పెట్టాలి. నగం తెలుసుకుంటే దాన్ని మధ్యలోనే వదిలేయాల్సి వస్తుంది. లేదా పరాజయంతో ముగించాల్సి వస్తుంది.

 స్త్రీకి అవమానం జరిగితే....స్త్రీని అవమానించకూడదు. కేవలం ద్రౌపదికి జరిగిన అవమానం వల్లే, ఆమె కౌరవ సామ్రాజ్యం మీద కోపం పెంచుకుంది. ఆమె చేసిన శపథమే. చివరికి కౌరవుల్ని. వాళ్ల సామ్రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేసింది. స్త్రీలు దేవతలతోసమానం వాళ్లని అవమానిస్తే వినాశనం తప్పదని భారతం మనకు చెస్తోంది.

శత్రువులే మిత్రులు: జీవితంలో కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురవుతారు. కౌరవుల పక్షాన నిలబడ్డ వాళ్లలో నిజానికి ఎంతోమంది. గొప్ప బలవంతులు. యుద్ధంలో వాళ్ళే గెలుస్తారేమో అనిపిస్తుంది. కానీ, వాళ్లలో చాలామంది పాండవులకి సాయపడతారు. భీష్మ, విదుర, ద్రోణుడు రహస్యంగా పాండవులకి ఎంతో సాయం చేస్తారు. ఇక విదురుడైతే.. కౌరవుల ప్రతీ అడుగు పాండవులకి మోసుకొచ్చాడు. ఇలా ఒక్కోసారి మనకు శత్రువులు కూడా పరోక్షంగా సాయపడతారు

ఆసక్తి ఉంటే చాలు..చాలామందికి తెలిసినంత వరకూ అర్జునుడే గొప్ప వీరుడు కానీ, కుటిల రాజకీయాల వల్ల తన వేలుని కోల్పోయిన ఏకలవ్యుడు.. అర్జునుడిని మించిన వీరుడు. నేరుగా గురువు దగ్గర శిక్షణ తీసుకోకున్నా.. అతనికి ఉన్న ఆసక్తే అర్జునుడి కన్నా గొప్ప వీరుడిగా మార్చింది. కాబట్టి, జీవితంలో ఏదైనా సాధించాలంటే.. మీకు ఉన్న లక్ష్యంపైన అమితమైన ఆసక్తి ఉండాలి. అదొక్కటి చాలు అనుకున్నది సాధించడానికి..!