Money Money : అప్పు చేయటంలో అతి వద్దు.. ఇస్తున్నారు కదా అని తీసుకుంటే నాశనమే..!

'అప్పు చేయని వాడు గాడిద, చస్తే తీర్చకు వాయిదా' అప్పుల అప్పారావు సినిమాలో రాజేంద్రప్రసాద్ పాడుతుంటే విని ఎంజాయ్ చేశాం. చేసిన అప్పులు తీర్చలేక తంటాలు పడుతుంటే హాయిగా చూశాం. కానీ గొప్పలకు పోయి అప్పులు చేసే వాళ్లు, అందరి ముందు స్టేటస్ గా బతకడం కోసం అప్పుల్లో మునిగేవాళ్లూ ఉన్నారు. బిల్డప్లకు పోయి, సంపాదించేదెంత? అని చూసుకోకుండా ఎక్కువ ఖర్చు చేసి అప్పుల పాలయ్యే వాళ్లు ఉన్నారు.

అప్పులో 'అతి' వద్దు

నిద్రలేచింది మొదలు పేపర్లలో,నిటీవీలలో రకరకాల అడ్వర్టైజ్ మెంట్లు--, షాపింగ్ మాల కు కూడా వెళ్లకుండా ఆన్లైన్లోనే ఆర్ధరిచ్చే సౌకర్యం... పక్కవాళ్లు కొన్నారు. నాకు లేకపోతే నలుగురిలో తక్కువ అవుతానేమోనని అప్పు చేసి కొనే వస్తువుల సరంజామా.... ఇలా అప్పు.. చేయడానికి కారణాలెన్నో.. కానీ చేస్తున్న అప్పు ఎందుకు? ఏమిటి? మళ్లీ తీర్చగలమా? అని ఎక్కువమంది ఆలోచించడం లేదు. జల్సాలకు అలవాటుపడిపోయి అప్పులు చేస్తున్నారు.

అప్పు తప్పు కాదు.. కానీ

అప్పు చేయడం తప్పకాదు. అవసరం వచ్చినప్పుడు ఎవరైనా అప్పు చేయ్యాల్సిందే. అనారోగ్యం, చదువు, పెళ్లిళ్లు, ఇల్లు కట్టుకోవడం లాంటి సందర్భాల్లో అప్పు చేయడం ఎవరికైనా సహజమే. కానీ ఇటీవల క్రెడిట్ కార్డులు వచ్చాక, ఆన్లైన్ బిజినెస్లు పెరిగాక.. అప్పులు చేయడం. ఎక్కువైపోయింది. దాంతో వచ్చే జీతంలో సగం వాటికే పోతుంది. ఇఎమ్ఐల రూపంలో జీతంలోనే కట్ అవుతుంది. అందువల్ల నెలలో సగం రోజులు కాగానే అప్పులు చేస్తున్నారు. జాబ్లో ఇంక్రిమెంట్ పడుతుందని, డిఏ పెరుగుతుందని ముందే అప్పులు చేసేవాళ్లు. ఉన్నారు. అప్పు చేసేముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాలి. అప్పు తప్పుకాదు, కానీ తప్పదు అనుకున్నప్పుడే చేయాలి. ప్రాణం మీదకు వచ్చినప్పుడే అప్పు తీసుకోవాలి. 

అప్పు ఇప్పటిది కాదు

అప్పు చేయడం అనేది ఇప్పుడు పుట్టింది. కాదు. తిరుపతి వేంకటేశ్వరస్వామిని వడ్డీకాసులవాడు అంటారు. ఎందుకంటే పద్మావతిని పెళ్లి చేసుకోవడానికి కుబేరుడి దగ్గర అప్పు చేస్తాడు. ఆ అప్పు తీర్చడానికి ఇప్పటికీ తన హుండీలో వచ్చిన ధనాన్ని కుబేరుడికి చెల్లిస్తున్నాడని చెప్తారు. సుమతీ శతకంలో బద్దెన 'అప్పిచ్చువాడు, వైద్యుడు...ఉన్న ఊరిలో ఉండాలన్నాడు. 

కానీ లక్షల్లో జీతాలు తీసుకుంటున్న వాళ్లు కూడా అప్పులు చేస్తూ జల్సాలు చేస్తున్నారు. ఇక ప్రభుత్వానికి కోట్ల రూపాయాల్లో టోపీ పెట్టి కొందరు విదేశాలకు వెళ్తున్నారు. అంతేందుకు ఒక్కమాటలో చెప్పాలంటే.. ప్రపంచం మొత్తం అప్పు చుట్టూ తిరుగుతూనే ఉంది. అందుకే పెద్దలు 'మంచం ఉన్నంత వరకే కాళ్లు ముడుచుకోవాలి". అని చెప్పారు. అంటే డబ్బులు చేతిలో ఉన్నంత వరకే ఖర్చు పెట్టుకోవాలని అర్థం.

 ఇచ్చేవాళ్లుంటే..తీసుకునే వాళ్లూ ఉంటారు.

అప్పు చేసి ఆర్బాటంగా జీవించే వాళ్ళు ఎక్కువవుతున్నారు. అప్పు ఇచ్చేవాడు. కనిపిస్తేచాలు, వడ్డీ ఎంతైనా ఓకే అని ఆడంబరాలకు పోతున్నారు కొందరు.. అప్పుల వల్ల మానవ సంబంధాలు దెబ్బతింటున్నా పట్టించుకోవడం లేదు. కేవలం హంగులతో ఇతరడమే ముఖ్యం నుకుంటున్నారు. అలాగే కొందరు "మా తాత ముత్తాతలు చాలా గొప్పగా బతికారు, నేనేం తక్కువా..' అన్నట్లు గొప్పలకు పోయి మరీ అప్పులు చేసి అనవసరమైన ఖర్చులు పెడుతుంటారు. మార్కెట్లోకి కొత్తగా వచ్చే ప్రతి వస్తువు తమ ఇంట్లో ఉండాలనుకుంటారు. అందుకోసం అప్పులపాలయినా తమ అలవాటును మార్చుకోరు. రోజూ అప్పుల వాళ్లు ఇంటి చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకుండా, బిల్డప్ట్లు ఇస్తుంటారు.

అప్పుల ఊబి

అప్పు చేయడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అత్యవసరం అయితేనే అప్పు చేయాలి. క్రెడిట్ కార్డులు ఉన్నాయని, బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయని అప్పులు చేస్తే.. తీర్పేటప్పుడు కష్టాలు తప్పదు. అందుకే అప్పు చేయకపోవడమే మంచిది. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో చేసినా.. తీర్చగలమా లేదా? ఎప్పటి లోగా తీర్చగలం? వడ్డీ ఎంతైతే కట్టగలం? సంపాదన ఎంత? ఖర్చు ఎంత?.. ఇలాంటివన్నీ బేరీజు వేసుకుని అప్పుచేయాలి. 

చేసిన తర్వాత అప్పు తీర్చాల్సిన రోజులు దగ్గరపడుతున్నప్పుడు కాకుండా, ముందు నుంచే ప్లాన్ ప్రకారం అప్పు తీర్చడం కోసం కొంత జమచేయాలి. నెలకు యాభైవేలు వస్తుందని లోన్లు తీసుకుని, వస్తువులు కొంటే, అనుకోని పరిస్థితులు ఎదురై ఉద్యోగం పోతే, అవి చెల్లించలేక నానా కష్టాలుపడాలి, డబ్బు, కాలం రెండూ మనిషికి చాలా ముఖ్యమైనవే. రెండూ చేజారితే మళ్లీ తిరిగి రావు. అందుకే ప్రతి ఒక్కరికీ డబ్బు మీద కంట్రోల్ ఉండాలి.

అప్పులతో అబద్ధాలు

అప్పుచేశాక అనుకున్న టైమ్ కు తీర్చడం అన్ని సార్లు కుదరకపోవచ్చు. మరోచోట అందాల్సిన డబ్బు టైము అందకపోవచ్చు. అలాంటప్పుడు అప్పిచ్చినవాళ్లకు నచ్చజెప్పక తప్పదు. అలా రెండుమూడు సార్లు జరిగితే ఎదుటి వాళ్లు నమ్మరు. అలాగే అప్పు కరెక్టు టైంకు తీర్చలేనప్పుడు అబద్ధాలు ఆడక తప్పదు. నాలుగు రోజుల్లో ఇస్తా.. పదిరోజుల్లో ఇస్తా లాంటి వాయిదాలతో పొడిగించాల్సి వస్తుంది. అప్పుల వాళ్ళు ఇంటికొస్తే మర్యాదలు చేసి కాఫీలు, టీలు ఇచ్చి నచ్చజెప్పినా అన్నిసార్లు నమ్మరు. 

దాంతో ఫోన్లో అబద్దాలు చెప్పడం, ఒకచోట ఉండి, మరోచోట ఉన్నా అనడం చెయ్యాల్సి వస్తుంది. అప్పు తీసుకున్న వాళ్లంతా నిజాయితీపరులు కాకపోవచ్చు. అవసరానికి డబ్బిచ్చి ఆదుకున్న స్నేహితులను మర్చిపోతారు. పైగా బదనాం చేస్తుంటారు. ఇచ్చిన వాళ్లను అమాయకుల కింద జమగడతారు. తీర్చకుండా ఇంటి చుట్టూ తిప్పుకుంటుంటారు. ఇలాంటి వాళ్లకు స్నేహితులు, బంధువులు లాంటి బంధాలతో పని ఉండదు.