కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..

మూత్ర పిండాలు సరిగా పని చేయక పోతే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడి గ్యాస్, పొట్ట ఉబ్బరం వంటివి సంభవిస్తాయి. అందుకే ఎప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాన్నే తీసుకోవాలి. కొన్ని చిట్కాలతో(tips) కిడ్నీలలో రాళ్ల సమస్యను తొలగించొచ్చు అవేంటో తెలుసుకుందాం.

మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. పరిష్కారం కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు. కానీ ఈ సమస్య కు ఇంట్లో కూడా చెక్ పెట్టొచ్చు. 

 గ్లాసు మామిడి పండ్ల రసంలో అరగ్లాసు క్యారెట్ రసాన్ని కలిపి రోజుకి రెండు సార్లు రెండు నెలల పాటు తీసుకుంటే రాళ్లు కరిగిపోతాయి.అంతేకాదు భవిష్యత్తులో ఈ సమస్య తలెత్తే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల పూర్తిగా ఆరోగ్యంగా ఉండటమే కాదు చర్మం కూడా కాంతివంతంగా ఉంటుందంటున్నారు వైద్యులు. మామిడి పండులో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది రేచీకటి కూడా రాకుండా కాపాడుతుంది. అంతేకాదు కంటి నుంచి నీరు కారడం, కళ్లమంటలు, దురదలు కూడా రాకుండా కాపాడుతుందంటున్నారు వైద్యులు.

కిడ్నీలో రాళ్లు పెరిగినప్పుడు కాల్షియం ఎక్కువగా ఉండే పండ్లను వీలైనంత తరచుగా తీసుకోవాలి. దీని కోసం మీరు బ్లాక్‌బెర్రీ, ద్రాక్ష, కివీ వంటి పండ్లను తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

నీరు ఎక్కువ తాగండి:  కిడ్నీల్లో రాళ్లతో బాధపడుతున్న వారికి అధిక నీటి శాతం కలిగిన పండ్లు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. తద్వారా శరీరంలో నీటి పరిణామం పరుగుతుంది. పుచ్చకాయ, కర్బుజా లాంటి పండ్ల వినియోగాన్ని పెంచడం ద్వారా.. కిడ్నీల సమస్య నుంచి బయటపడొచ్చు..నీరు ఎంత ఎక్కువ తాగితే కిడ్నీలకు అంత మంచిది. దీనివల్ల వల్ల ఖనిజాలు, ఇతర మలినాలను బయటకు పంపడం కిడ్నీలకు తేలికవుతుంది. కిడ్నీలకు హాని కలిగించే అనవసర వ్యర్థాలను బయటకు పంపేందుకు నీరు సహకరిస్తుంది. కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నవారు నీరు తాగడం వల్ల మూత్రం ద్వారా రాళ్లు బయటకు వెళ్తాయి. రోజూ 7-8 గ్లాసుల నీరు తప్పకుండా తాగాలి.

ఆపిల్ సీడర్ వెనిగర్: ఇందులోని సిట్రిక్ యాసిడ్ కిడ్నీ రాళ్లను చిన్న ముక్కలుగా విడగొడుతుంది. మూత్రాశయం గుండా రాళ్లు బయటకు వెళ్లేందుకు సహకరిస్తుంది. ఆపిల్ సీడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల కిడ్నీల నుంచి ట్యాక్సిన్లు బయటకు వెళ్లి శుద్ధి అవుతాయి. రాళ్లు తొలగిపోయే వరకు రెండు టేబుల్ స్పూన్ల ఆపిల్ సీడర్ వెనిగర్‌ను వెచ్చని నీటిలో కలిపి తీసుకోవడం మంచిది.

కిడ్నీ బీన్స్: కిడ్నీ బీన్స్ కూడా మూత్ర పిండాల్లో రాళ్లను బయటకు పంపేందుకు సహకరిస్తాయి. కిడ్నీ బీన్స్‌ను 8 నుంచి 12 గంటలు నీటిలో నానబెట్టి ఉడకబెట్టి తినండి. కిడ్నీ బీన్స్‌లో ఉండే ఫైబర్ మూత్ర పిండాల్లోని రాళ్లను బయటకు గెంటేస్తాయి. రోజులో ఒక్కసారైనా వీటిని తీసుకోండి.

ఎండబెట్టిన తులసి ఆకులు: ఎండబెడ్టిన తులసి ఆకులను పొడిగా నలిపండి. ఒక టేబుల్ స్పూన్ పొడిని నీటిలో కలిపి తేనీరు తయారు చేయండి. ఈ టీని రోజులో మూడు సార్లు తాగండి. ఇది కడుపులోని ఎసిటిక్ యాసిడ్‌ను విచ్ఛిన్నం చేస్తుంది. దీని వల్ల కిడ్నీలోని రాళ్లు సైతం విచ్ఛిన్నమై సులభంగా బయటకు పోతాయి.

మొక్కజొన్న పీచు (కార్న్ సిల్క్): మొక్కజొన్న కంకి ఒలిచేటప్పుడు వచ్చే సిల్క్ దారాల్లాంటి కార్న్ సిల్క్‌ను వృథాగా పడేస్తారు. కానీ అవి కిడ్నీ రాళ్లను బయటకు పంపడంలో సమర్థవంతంగా పని చేస్తాయి. వాటిని నీటిలో ఉడికించి చల్లారాక వడగట్టి తాగాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలో కొత్తగా రాళ్లు ఏర్పడవు. ఇది మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చూస్తుంది. కిడ్నీ స్టోన్స్ వల్ల వచ్చే నొప్పిని తగ్గించడంలో కార్న్ హెయిర్ ఉపయోగపడుతుంది.

నిమ్మరసం, ఆలివ్ ఆయిల్: కిడ్నీలోని రాళ్లను బయటకు పంపడంలో నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ మిశ్రమం కూడా బాగా ఉపయోగపడుతుంది. నిమ్మరసం కిడ్నీ రాళ్లను ముక్కలుగా చేస్తే.. వాటిని సులభంగా బయటకు పంపేందుకు ఆలివ్ ఆయిల్ లూబ్రికెంట్‌లా ఉపయోగపడుతుంది.కిడ్నీలో రాళ్లు కరగాలంటే ఒక స్పూన్​నిమ్మరసం (lemon), తేనె మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలట. కనీసం ఆరు నెలల పాటు తీసుకుంటే మంచి ఫలితాలు(results) ఉంటాయని ఆయుర్వేదం(Ayurveda) చెబుతోంది. నిమ్మరసంలో సైంధవ లవణం కలుపుకొని తాగితే మూత్రపిండాల్లో రాళ్లు(stones) కరిగిపోతాయని ఆయుర్వేదం అంటోంది. ప్రతీరోజు ఉదయాన్నే కొబ్బరినీళ్లు తాగితే కిడ్నీ స్టోన్స్​, ఇతర వ్యర్థాలు తొలగిపోతాయి

దానిమ్మ: దానిమ్మ రసం శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. కిడ్నీ రాళ్లను సహజంగా తొలగించడానికి దానిమ్మ రసం పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది.దానిమ్మ, దానిమ్మ రసం తీసుకోవడం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్ ల నుంచి కాపాడతాయి. కిడ్నీ సమస్యలు ఉన్నవారికి  పైబర్ ఎక్కువగా ఉండే గుడ్లు, చిక్కుళ్ళు, నువ్వులు, అవిసె గింజలు, కొత్తిమీర, అల్లం, దాల్చిన చెక్క, డార్క్ చాక్లెట్ లను వాడుకోవచ్చు. ముఖ్యంగా నీరు మూత్రపిండాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కాయ కూరలు తీసుకోవడం ద్వారా కిడ్నీలు  ఆరోగ్యంగా ఉంటాయి.

దోసకాయ(cucumber)లో 96 శాతం నీరు ఉంటుంది. ఇది కూడా కిడ్నీ(kidney)ల ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. 

కిడ్నీ సమస్యలతో బాధపడే వారు …గుడ్డు మీకు ఇష్టమైన ఆహారం అయితే మీరు పచ్చసొన వదిలేసి తెల్లసొనను ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. దీనివల్ల శక్తి రావడంతో పాటు ఎటువంటి నష్టం జరగదు. వెల్లుల్లి కిడ్నీల ఆరోగ్యానికి సహాయపడుతుంది.గుడ్లు, కాయకూరలు, చేపలు, తృణధాన్యాలు వంటివి మన కిడ్నీ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.  

 కాలీఫ్లవర్ లో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు కాలీఫ్లవర్ తినడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.