ఎండాకాలం మొదలైంది. ఏ చిన్న పని చేసినా జనాలు అలసటకు గురవుతారు. నీరసం... నిరుత్సాహంతో రోజంతా గడుపుతారు. ఓ పక్క ఎండవేడిమికి ఉక్కపోత.. మరోపక్క బాడీ వీక్ నెస్ తో ఎండాలం వెళ్లదీస్తుంటారు. అయితే రోజు పొద్దన్నే పరగడపున కొన్ని పదార్ధాలు తీసుకుంటే నీరసం.. నిస్సత్తువు ఎగిరిపోయి.. ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడుపుతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ పదార్ధాలు ఏంటో తెలుసుకుందాం. . .
పొద్దున్నే కాలకృత్యాల అనంతరం.. సమ్మర్ సీజన్ లో ఆహారంగా తీసుకుంటే నీరసం రాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గంటల తరబడి మిమ్మల్ని పూర్తి శక్తితో ఉంచుతుంది. తినే ఆహారంలో ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, సూక్ష్మపోషకాలను కలిగి ఉండాలి. అందుకే మనం ఉదయం ఖాళీ కడుపుతో తీసుకునే ఆహరం, పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కడుపు, ప్రేగు, మొత్తం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే.. ఉదయం ఖాళీ కడుపుతో ఎలాంటి ఆహారంతినాలో వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
అరటిపండు: ఇందులో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే రెండు అరటిపండ్లు తింటే రోజంతా అదనపు శక్తి ఉంటుంది.అరటిపండ్లలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది సెరోటోనిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. సెరోటోనిన్ మనల్ని రిలాక్స్‌గా, సంతోషంగా ఉండేలా చేస్తుంది. బ్లడ్ షుగర్ తక్కువగా ఉన్నవారు అరటి పండ్లను తింటే కార్బోహైడ్రేట్లు ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తాయి. కాబట్టి అల్పాహారానికి ముందు అరటిపండు తినండి.
ఖర్జూరాలు: వీటిని రోజువారీ ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యాన్ని పొందేందుకు సహాయపడే అన్ని రకాల పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఖర్జూరాలలో కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్, ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, కాపర్, కాల్షియం, సోడియం మొదలైన ఖనిజాలు, విటమిన్లు A, B1, B2, C సమృద్ధిగా ఉంటాయి. ఆహారంలో ఖర్జూరాలను చేర్చుకోవడం వల్ల ఫ్రీ రాడికల్ డ్యామేజ్‌ను నివారించవచ్చు. కొరోనరీ హార్ట్ డిసీజ్, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఆపిల్స్: ఉదయాన్నే ఖాళీ కడుపుతో యాపిల్‌ను తింటే ఎక్కువ లాభాలు పొందొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య పరంగా యాపిల్ అనేక ప్రయోజనాలను అందిస్తుంది. విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, జింక్, ఫైబర్, ప్రోటీన్ వంటి పోషకాలు ఆపిల్స్‌లో పుష్కలంగా లభించి ... రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. గుండె జబ్బులు వచ్చే రిస్క్ సైతం తగ్గుతుంది. అంతేకాదు, ఖాళీ కడుపుతో యాపిల్‌ను తింటే మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. శరీరంలో వాపులు తగ్గుతాయి. మెదడు చురుగ్గా పని చేస్తుంది. శరీరం రోజంతా యాక్టివ్‌గానూ ఉంటుంది.అధిక రక్తపోటుతో బాధ పడే వారు ఖాళీ కడుపుతో ఆపిల్ తింటే చాలా మేలని అంటున్నారు.
బాదం: రోజూ ఉదయాన్నే రెండు బాదం పప్పులు తింటే విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తుంది. దీనిని సలాడ్ రూపంలో, పచ్చిగా కూడా తినవచ్చు. లేదంటే ప్రోటీన్ షేక్స్‌లో యాడ్ చేసుకున్న సరే. కాఫీకి ప్రత్యామ్నాయంగా బాదం పాలను కూడా తాగవచ్చు. బాదం పప్పులో చెడు కొవ్వును తగ్గించి... ఆకలిని అరికట్టే లక్షణాలు ఉన్నాయి. అధిక ఫైబర్కంటెంట్ ఉన్న బాదంపప్పులో విటమిన్ E, ప్రోటీన్, ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్, మాంగనీస్, ఫైబర్‌తో నిండిన బాదం మీకు బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ అవుతుంది. కానీ వీటిని రాత్రంతా నానబెట్టిన తరువాత తింటే చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
పెరుగు: ప్రొటీన్లు అధికంగా ఉండే పెరుగు ఉదయాన్నే తినటం వల్ల పొట్ట నిండుగా ఉంచుతుంది. పొట్టను ఆరోగ్యంగా ఉంచే మంచి ప్రోబయోటిక్ ఇందులో ఉంటుంది. పండ్లు, తేనెతో తింటే మంచిది. పెరుగు ఖాళీ కడుపుతో తినడానికి ఉత్తమమైన ఆహారం. ఇది ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ, బలమైన రోగనిరోధక వ్యవస్థను నిర్వహించడానికి సహాయపడే ప్రోబయోటిక్స్‌తో నిండి ఉండి ఆరోగ్యానికి తోడ్పడతాయి.
గుడ్లు: గుడ్లు ఖాళీ కడుపుతో తినడానికి గొప్ప అల్పాహారం అవుతుంది. ఉదయాన్నే గుడ్లు తినటం వల్ల కడుపు నిండుగా ఉంటుంది.ఉడకబెట్టినా, లేదంటే, ఆప్లేట్‌గా తిన్నా కూడా గుడ్లు చాలా మంచి అనుభూతిని కలిగించే అల్పాహారం అవుతుంది. దీంతో మీకు ఆకలి బాధలు తక్కువగా ఉంటాయి. గుడ్లలో ఐరన్, విటమిన్ డి, పొటాషియం, జింక్ మరిన్ని ఉంటాయి. ఇవి మీ శక్తి స్థాయిలను పెంచుతాయి. గుడ్లలో ఉండే అధిక-నాణ్యత ప్రోటీన్ మీ శరీరం ద్వారా సులభంగా జీర్ణమవుతుంది. వీటిని మంచి బరువు తగ్గించే ఆహారంగా ఉపయోగించవచ్చు.
చియా విత్తనాలు: చియా గింజలు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఇది తింటే కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. ఉదయం స్మూతీలో వాటిని కలిపి తింటే మంచిది. త్వరగా ఆరోగ్యవంతంగా బరువు తగ్గటంలో దోహదపడుతుంది.