Good Health : పిల్లల కోసం ప్రత్యేకంగా ఉన్న యోగాసనాలు ఇవే..

పిల్లలు కూడా చాలాసార్లు ఒత్తిడి, ఆందోళనతో బాధపడతారు. వారికి సరైన మోటివేషన్ లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడతారు. వాళ్లకూ యోగా నేర్పించడం వల్ల... వాళ్లలో తెలియకుండా ఉన్న భయం, ఆందోళన, ఒత్తిడి నుంచి రక్షించవచ్చు. యోగా గ్రాండ్ మాస్టర్ అక్షర్ పిల్లలు చేయగలిగే ఈ ఐదు ఆసనాలను సూచిస్తున్నారు. 

వృక్షాసనం 

కుడి పాదాన్ని, ఎడమ పాదం తొడలపై పెట్టాలి. శరీరం మొత్తాన్ని నిటారుగా ఉంచాలి. చేతులు తలపైన సూర్య నమస్కారం చేస్తున్న విధంగా పెట్టుకోవాలి. ఈ ఆసనం భుజాలను, మోకాళ్లను, తొడలను బలంగా చేస్తుంది. అలాగే ఎత్తు పెరగడానికి ఎంతో ఉపయోగపడుతుంది. 

సంతులన ఆసనం

బోర్లా పడుకోవాలి. అరచేతులను నేలపై ఆనించి, పూర్తి శరీరాన్ని పైకి లేపాలి. అరచేతులు, భుజాలకు సమానంగా ఉండాలి. తర్వాత కాలివేళ్లపైనే పాదాలను పైకి లేపాలి. ఇలా మొత్తం శరీరం, అరచేతులు, కాలి వేళ్ల పైనే ఎత్తాలి. ఇలా చేయడం వల్ల భుజాలు, కండరాలు బలపడతాయి. నరాలు కూడా ఆరోగ్యంగా తయారవుతాయి.

వజ్రాసనం

మొదట మోకాళ్ల మీద కూర్చోవాలి. మడమలను ఫ్రీగా వదిలేయాలి. తర్వాత కాలివేళ్లను బయటకు విప్పాలి. అరచేతులను మోకాళ్లపై ఉంచాలి. వెన్నును నిటారుగా చేయాలి. ఆ తర్వాత గాలిపీలుస్తూ నెమ్మదిగా వదిలేయాలి. ఈ ఆసనం జీర్ణవ్యవస్థను మెరుగుపరస్తుంది. అన్నం తిన్న తర్వాత ఆ ఆసనాన్ని చేయొచ్చు. ఈ ఆసనం ఒత్తిడిని తగ్గించి, మనస్సును, శరీరారాన్ని ఉత్తేజంగా చేస్తుంది.

ధనురాసనం

పొట్ట మీద బోర్లా పడుకోవాలి. మోకాళ్లను వీపు పైకి పంపుతూ చేతులతో పట్టుకోవాలి. కాలివేళ్లు నిటారుగా పైకి ఉంచాలి. కొద్ది సేపు అలాగే పట్టుకొని పైకి చూడాలి. ఈ ఆసనం బ్లడ్ సర్య్కులేషన్ను ఇంప్రూవ్ చేస్తుంది. వెన్నుముఖను, వీపులోని నరాలను యాక్టివ్ చేస్తుంది.భుజాలు, మెడ ఆరోగ్యంగా తయారవుతాయి.

వశిష్టాసనం

ఈ ఆసనాన్ని సంతులన ఆసనంతో మొదలు పెట్టాలి. సంతులన ఆసనంలో ఉన్న ఎడమ అరచేతిని నేలపై గట్టిగా ఉంచి, కుడి చేతిని నేలపై నుంచి తీయాలి. దాన్ని నిటారుగా పైకి లేపాలి. ఆ చేతి నుంచి ఆ వైపు చూడాలి.  మోకాళ్లు, మడమలు, పాదాలు అన్ని ఒకదానితో ఒకటి దగ్గర చేయాలి. రెండు చేతులు, భుజాలు ఒకే సరళ రేఖలో ఉండేలా చూసుకోండి. ఇలా కొద్ది సేపు ఉన్నతర్వాత ఎడమ వైపుకు తిరిగి అలాగే చేయాలి. ఆ ఆసనం ద్వారా పిల్లల్లో కండరాలు బలపడతాయి. శరీరాన్ని బ్యాలెన్స్ చేయడం అలవాటు అవుతుంది.

ALSO READ : ODI World Cup 2023: సునామీలా వచ్చిన మంచు.. మీమ్స్ తో చెలరేగిన క్రికెట్ ఫ్యాన్స్