Office culture: బెస్ట్ ఎంప్లాయి కావాలనుకుంటున్నారా.. అయితే ఆఫీసులో ఇలా ఉండండి..!

ఆఫీస్ లో పర్ ఫెక్ట్  అనిపించుకోవాలనీ..  బెస్ట్ ఎంప్లాయ్ కావాలని అందరికి ఉంటుంది. కానీ అందరికీ సాధ్యంకాదు. కారణం.. తెలిసీ తెలియక పని వేళల్లో మనం చేసే పొరపాట్లే... అవే తోటి ఎంప్లాయిస్ దృష్టిలో నెగెటివ్ చేస్తాయ్. నలుగురూ పక్కన పెట్టేలా చేస్తాయ్. అలా కాకుండా ఉండాలంటే అవేంటో తెలుసుకుని సరిదిద్దుకుంటే బెస్ట్ ఎంప్లాయ్ అవ్వొచ్చు..

ఓవర్ కాన్ఫిడెన్స్

వర్క్ ప్లేస్లో మన చేతలు కనిపించాలే కానీ మాటలు కాదు. అరగంటలో ఈ పని కంప్లీట్ చేస్తా... మీకెందుకు నేను చూసుకుంటా! అనే మాటలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇలాంటి మాటల వల్ల వాళ్లపై ఆఫీసర్లకు, తోటి ఉద్యోగులకు వాళ్లపై ఎక్స్ పెక్టేషన్స్ పెరుగుతాయ్. వాళ్ల అంచనాలకు తగ్గట్టుగా పని లేకపోతే వాళ్లపై నమ్మకం పోతుంది. ఇంకోసారి పని చెప్పాలన్నా సంకోచిస్తారు. అందువల్ల పనిచేసి చోట ఇలాంటి గొప్పలకు పోకూడదు. 

ఒకవేళ పనిని అరగంటలో పూర్తి చేయగల కెపాసిటీ మీకు ఉన్నా ఆ విషయాన్ని బయటకు చెప్పకూడదు. డెడ్ లైన్స్ మధ్య పని చేస్తే ఒత్తిడికి లోనై తప్పులు దొర్లుతాయ్. అందువల్ల అరగంటలో చేయగలిగే పనికి ముప్పావు గంట కేటాయించాలి. ఎలాంటి మిస్టేక్ లేకుండా వర్క్ సబ్ మిట్ చేయాలి. అలాగే తలకు మించిన భారాన్ని తలకెత్తుకోకుండా మీకున్న సమయం. ..ఓపికని బట్టి పనిచేయాలి.

దూరంగా ఉండండి

ఆఫీసులో రకరకాల మనస్తత్వాలున్న మనుషులుంటారు. అలాంటి చోట పని చేసేటప్పుడు అందరితో కలివిడిగా ఉండకపోయినా పర్లేదు కానీ శత్రుత్వం పెట్టుకోకూడదు. ఎగతాళి మాటలతో ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు.. ఒక్కొక్కరి ఆలోచనా విధానం ఒక్కోలా ఉంటుంది. అందువల్ల ఎదుటివాళ్లు తమ ఆలోచనలకు, అభిప్రాయాలకు తగ్గట్టుగా ఉందాలని కోరుకోవడం తప్పు ...నచ్చకపోతే దూరంగా ఉండాలి. కానీ, వాళ్లని నలుగురిలో దోషులుగా నిలబెట్టే ప్రయత్నాలు చేయకూడదు.

Also Read : ఇలా మాట్లాడితే మిమ్మలను ఎప్పటికి మర్చిపోరు..

ఎమోషన్స్ కంట్రోల్

వర్క్ ప్లేస్ లో  ప్రతిచిన్న విషయాన్ని మనసుకి తీసుకుని బాధపడేవాళ్లు కొందరైతే....అలాంటి వాళ్లనే టార్గెట్ చేసుకుని టైంపాస్ చేసేవాళ్లు మరికొందరు.   అందువల్ల కోపం లాంటి ఎమోషన్స్ ని ఎక్కువగా చూపించకూడదు. టార్గెట్ చేసే అవకాశం ఎదుటి వాళ్లకు ఇవ్వకూడదు. ఒకవేళ ఎలాంటి ప్రమేయం లేకుండా టార్గెట్ చేసినా వాటిని మనసుకి తీసుకోకుండా పెడచెవిన పెట్టాలి. మన ఎమోషన్స్ పై ఎదుటివాళ్లు అధిపత్యం యించకుండా చూసుకోవాలి.

బాస్ లని అర్థం చేసుకోవాలి...

చాలామంది ఎంప్లాయినికి బాస్ లు నచ్చరు.   దానికి కారణం బాస్ ఎంప్లాయిస్ కన్నా ఒకమెట్టు అధికారంలో పైనుండటమే. కానీ ఆ అధికారం అనుభవంతో వస్తుందని గుర్తించాలి. వాళ్లపై పదింతల పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆ ఒత్తిడిలో వాళ్లు ఏదైనా మాట అన్నా పరిస్థితులను అర్ధం చేసుకోవాలి గానీ నెగెటివ్ గా  చూడకూడదు. తోటి ఉద్యోగులతో కలిసి బాస్ ను తిట్టుకోవడం లాంటివి చేయకూడదు. ఏ ఆర్గనైజేషన్ అయినా సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వాలంటే బాస్..... ఎంప్లాయిస్ మధ్య రిలేషన్ బాగుండాలి. అందువల్ల బాస్ తో మంచి రిలేషన్.... మెయింటెయిన్ చేయడం అవసరం. ఒకవేళ వర్క్ పర్ఫెక్ట్ గా ఉన్నా కూడా మాట వస్తే బాస్ తోమాట్లాడి ఆపోహలను క్లియర్ చేసుకోండి. అంతేకానీ నలుగురి దగ్గరికి  ఆ మాటల్ని చేరవేయడం మంచిది కాదు.

గాసిప్స్

ఇతరుల గురించి లేనిపోనివి కల్పించి గాసిప్స్ స్ప్రెడ్ చేయడం వల్ల ఆఫీసులో మంచి పేరు ఉండదు. ముఖ్యంగా పనిచేసేచోట, అనవసరపు గాసిప్స్ లో ఇన్వాల్వ్ అయితే నలుగురిలో నెగిటివ్ అవ్వడం ఖాయం.   ఇలాంటి వాళ్లకి సాధ్యమైనంత దూరంగా ఉండటానికి అందరూ ఇష్టపడతారు. అందువల్ల దూరంగా ఉంటే అందరూ త్వరగా కలిసిపోతారు. వర్క్ విషయంలో ఏదైనా పొరపాటు చేసినా సరిదిద్దే ప్రయత్నం చేస్తారు.

నెగెటివిటీకి దూరంగా...

కలిసి ఒక టీమ్ గా పనిచేస్తున్నప్పుడు పాజిటివ్ ఆలోచనలతో ముందుకెళ్లాలి. ఏదైనా నెగిటివ్ అనిపించినా.,.. సక్సెస్ అవ్వలేం అనిపించినా... ఆ ఆలోచనల్ని నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయాలి.  అంతేకానీ తోటి టీమ్ మెంటర్స్ బుర్రలోకి నెగెటివ్ ఆలోచనల్ని ఎక్కించే ప్రయత్నం చేయకూడదు.

పాడైనవి  పట్టుకు పోవద్దు...

కొందరు ఆఫీసుకి లేటు అవుతుందన్న హడావిడిలో ముందురోజు డిన్నర్లో మిగిలిన వంటల్ని లంచ్ బాక్స్ తెచ్చుకుంటారు. అది బాగుంటే ఓకే కానీ, అటుఇటు అయి పాడైతేనే ఇబ్బంది. పాడైన వంటలు లంచ్ బాక్స్ లో తీసుకొస్తే తోటి ఉద్యోగులకు ఇంప్రెషన్ పోతుంది. అందుకని లంచ్ తాజాగా ఉన్నవే తెచ్చుకోవాలి.

ఉద్యోగం పై అయిష్టం...

'ఐ హేట్ మై జాబ్ ఈ మాట చాలా కామన్ అయిపోయింది ఈమధ్య ఈ మాట మనసులో అనుకుంటే ఓకే కానీ ఆఫీసులో పదేపద్ చెప్తేనే అసలు సమస్య ఉద్యోగమే నచ్చనప్పుడు ఎవరినైనా నమ్మి పనెలా అప్పగిస్తారు.. ఇంట్రెస్ట్ లేదని బాసు కూడా పక్కన పెడతారు. అందువల్ల అలాంటి మాటలు అనకూడదు. అంతలా నచ్చకపోతే నచ్చిన ఉద్యోగాన్ని ఎంచుకోవాలి. అంతేకాని మనం చేస్తున్న పనిని అసహ్యించుకుంటే ఎలా..

వెనక మాట్లాడొద్దు...

పనిలో ఏదైనా పొరపాటు దొర్లితే ... దానికి చేసినవారిదే బాధ్యత. అందువల్ల ఎదుటివాళ్లపై తప్పుని రుద్దే ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ ఎదుటివాళ్ల సలహాల వల్ల తప్పు జరిగినా దానికి పూర్తి బాధ్యత తీసుకోవాలి. ఇంకోసారి ఆ తప్పు జరగకుండా చూసుకోవాలి

-వెలుగు, లైఫ్-