Health Alert: జాగ్రత్త.. ఈ 4 విటమిన్ లోపాలు క్యాన్సర్‌కు దారితీస్తాయట..

ఇటీవల కాలంలో విటమిన్ ఢెఫిషియెన్సీ అనేది చాలామందిలో కనిపిస్తుంది. పలు రకాల విటమిన్ల లోపంతో బాధపడుతుంటారు. మన శరీరంలోని తక్కువ స్థాయి విటమిన్లు క్యాన్సర్ బారిన పడి జరిగే మరణాలను పెంచుతుందట. విటమిన్ డి, విటమిన్ ఎ, విటమిన్ సి ,బి 12 లోపిస్తే పెద్దప్రేగు, కడుపు, ఊపిరితిత్తులు, రక్తం వివిధ క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. విటమిన్ల లోపం, ప్రాణాంతక ఆనారోగ్య సమస్యలకు ఎలా దారితీస్తుంది, క్యాన్సర్ కు ఎలా దారి తీస్తుందనేది తెలుసుకుందాం. 

విటమిన్లు మన శరీరం సరైన పనితీరును, పెరుగుదలకు మద్దతునివ్వడమే కాకుండా వివిధ రకాల తీవ్రమైన ఆరోగ్య రుగ్మతలను నివారించడంలో సహాయపడతాయి. అనేక అధ్యయనాలు తక్కువ స్థాయి విటమిన్లతో కొన్ని రకాల క్యాన్సర్లను అభివృద్ధి చేసే ప్రమాదం ఉందని చెబుతున్నాయి. - ఎందుకంటే ఈ పోషకాలు మీ రోగనిరోధక శక్తి స్థాయిలను నిర్మించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

విటమిన్ లోపాన్ని గుర్తించడం ఎలా 

వివిధ రకాల శారీరక ప్రక్రియలకు విటమిన్లు చాలా ముఖ్యమైన సమ్మేళనాలు. ప్రతి విటమిన్ ఓ ప్రత్యేకమైన ప్రయోజనాన్ని అందిస్తుంది. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచడం, శక్తి ఉత్పత్తి సులభతరం చేయడం వంటి అనేక ఆరోగ్యకరమైన లాభాలను అందిస్తాయి. అందుకే విటమిన్ లోపం అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. విటమిన్ లోపం తగినంత ఆహారం తీసుకోకపోవడం,  బలహీనమైన శోషణ, ఆనారోగ్యం కారణంగా ఏర్పడవచ్చు. 

Also Read : మీ వాహనాల్లో గాలి తగ్గుతుందా

ఏ విటమిన్ లోపం వల్ల క్యాన్సర్ వస్తుంది?

విటమిన్ డి

తగినంత విటమిన్ డి లోపం వల్ల కొలెస్టరాల్, మూత్రాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. విటమిన్ డీ లోపం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. సగటున ఐదున్నర ఏళ్లు విటమిన్ డి లోపం ఉన్నవారికి ఫాలో అప్ సమయంలో కొలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 31 శాతం ఉందని చెబుతున్నారు. ఈ ప్రభావం పురుషులకంటే స్రీలలో ఎక్కువగా ఉంటుందంటున్నారు. 

విటమిన్ సి

విటమిన్ సి ని ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంది నీటిలో కరిగే ఏకైక విటమిన్ సి. ఇది బలమైన రోగనిరోధక ప్రతిస్పందన.గాయం నయం , కొల్లాజెన్ ఏర్పటడానికి ఎంతో సహాయపడుతుంది. ఈ విటమిన్ లోపిస్తే ప్రాణాంతక అవుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. సి విటమిన్ లోపం జీర్ణవ్యవస్థపై అధిక ప్రభావం చూపుతుందంటున్నారు. అన్నవాహిక, కడుపు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. 

విటమిన్ B12

మన శరీరంలో విటమిన్ B12 లోపిస్తే హానికరమైన రక్త హీనతకు దారితీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. B12 లోపం వల్ల కడుపులోని  ఆరోగ్యకరమైన కణాలు నశించి కడుపు క్యాన్సర్ ను అభివృద్ది చేసే ప్రమాదాన్ని పెంచుతుంది. B12 లోపిస్తే కడుపులో పోషకాలను గ్రహించే ముఖ్యమైన అంతర్గతంగా స్రవించే కణాలు నాశనం అవుతాయంటున్నారు అలాగే B12 హైపోవిటమినోసిస్ తరచుగా లుకేమియా లేదా లింఫోమా వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడతారు. ఎర్ర రక్త కణాల ఎముక మజ్జ ఉత్పత్తిని ప్రభావితం చేసే రక్త క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. 

విటమిన్ ఎ లోపం

విటమిన్ ఎ - కొవ్వులో కరిగే విటమిన్..సెల్యులార్ అభివృద్ధికి, రోగనిరోధక శక్తికి, దృష్టికి చాలా ముఖ్యం. రెటినోయిడ్స్ అని కూడా పిలువబడే విటమిన్ ఎ కణాల అభివృద్ధికి , జన్యు పరమైన అభివృద్ధికి కీలకం అని వైద్యులు చెబుతున్నారు. పరిశోధన ప్రకారం.. విటమిన్ ఎ లోపం కడుపు, అన్నవాహిక, ఊపిరితిత్తులతో సహా కొన్ని రకాల క్యాన్సర్‌లను అభివృద్ధి చేసే అవకాశాన్ని పెంచుతుంది.

సో.. విటమిన్ లోపాలు రాకుండా  ప్రతి ఒక్కరు జాగ్రత పడాల్సిన అవసరం ఉంది.