దంచికొట్టిన వర్షం: మూడు గంటల పాటు అంధకారంలో నల్గొండ

నల్లగొండలో బుధవారం (అక్టోబర్ 30) రాత్రి వర్షం దంచికొట్టింది. దాదాపు మూడు గంటల పాటు పట్టణంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. టౌన్‎లో ఏకధాటిగా వర్షం పడటంతో 46.5 మీమీ వర్షపాతం నమోదు అయ్యింది. పట్టణంలోని వీధులన్నీ జలమయమయ్యాయి. వెంకటేశ్వర కాలనీ, హనుమాన్ నగర్, పానగల్ చౌరస్తాలో మోకాళ్ళ లోతుకుపైగా వరద నీరు రావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం ధాటికి మూడు గంటలు నల్గొండ పట్టణం అంధకారంలో మునిగిపోయింది. అత్యధికంగా కట్టంగూర్‎లో 102.8 మీమీ వర్షపాతం నమోదు అయ్యింది. ఆకస్మిక వర్షంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. 

ALSO READ | యాదాద్రి జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి