సిమ్లాలో ఉద్రిక్తత.. అక్రమ కట్టడంపై ఆందోళనలు

హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో బుధవారం ఉద్రిక్తత వాతావరణ ఏర్పడింది. సంజౌలి ప్రాంతంలో మసీదు అక్రమంగా నిర్మించారని అనేక హిందూ సంస్థలు ధల్లి ప్రాంతంలో రోడ్డపైకి వచ్చాయి. ఐదు అంతస్తుల మసీదు అక్రమంగా నిర్మించారంటూ ఆరోపిస్తూ ఆందోళన చేశారు. కొందిపాటి సమయంలోనే అక్కడికి వేల మంది చేరుకున్నారు. వారిని అదుపు చేయడానికి వెంటనే భారీగా పోలీసు బందోబస్తు అక్కడికి చేరుకున్నారు. 

నిరసనకారులు పోలీసు బారికేడ్లను తోసుకుంటూ వచ్చారు. పరిస్థితి అదుపులోకి తేవడానికి పోలీసు బలగాలు లాఠీఛార్జ్ చేశారు. సిమ్లాలోని ధల్లీ టన్నల్ వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Also Read :- కడుపు మంటతో ఓలా షోరూంను తగలబెట్టిన కస్టమర్

నిరసన ర్యాలీ కార్యక్రమంలో ఎలాంటి దుర్ఘటన జరగకుండా అధికారులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆందోళనకారులు ర్యాలీగా వచ్చి బారికేడింగ్‌ను తొలగించి, ధల్లీ టన్నెల్ ఈస్ట్ పోర్టల్‌లోకి ప్రవేశించారు. పోలీసులు వారిని చెదరగొట్టడానికి వాటర్ ఫిరంగులను ఉపయోగిస్తున్నారు. అయినా కూడా వారు రోడ్డుపై భైఠాయించారు.

ప్రస్తుతం జనం మధ్యకు చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. నిరసనకారులు అడ్డుకుని రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు జోక్యం చేసుకున్నప్పటికీ, అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని అక్కడి వచ్చిన వారి డిమాండ్. మసీదును అనధికారికంగా నిర్మించడంపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. 

Also Read :- నెయ్యి టీ తాగండి.. ఎందుకంటే..

ఇష్యూ మతపరమైన స్థలం గురించి కాదని.. చట్టాన్ని అతిక్రమించిన అక్రమ నిర్మాణానికి సంబంధించినదని నిరసనకారులు వాదించారు. 2010 నుంచి ఈ వివాదం కొనసాగుతుంది. 6750 చదరపు అడుగులకు విస్తర్ణంలో  మసీదు 1947 నాటి కంటే ముందే అక్కడ ఉందని, అది వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉందని మసీదు ఇమామ్ చెప్తున్నారు.