ఆర్మూర్ నవనాథ సిద్ధుల గుట్ట​ ఆలయాల్లో కార్తీక పూజలు

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్​టౌన్​లోని  నవనాథ సిద్ధుల గుట్టను సోమవారం భక్తులు దర్శించుకున్నారు. గుట్టపైన ఉన్న శివాలయం, రామాలయం, అయ్యప్ప మందిరాల్లో  ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామాలయం నుంచి జీవకోనేరు వరకు ఉత్సవ మూర్తులకు పల్లకిసేవ జరిపారు.  పల్లకిసేవలో భక్తులు భజనలు చేస్తూ సంకీర్తనలు పాడారు.  

సిద్ధరామేశ్వర స్వామి ఆలయంలో..

భిక్కనూరు, వెలుగు : భిక్కనూరు  శ్రీ పార్వతీ సిద్ధరామేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో భక్తులు ఉదయం నుంచే ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు  అన్న ప్రసాద వితరణ చేశారు.  కార్యక్రమంలో  ఆలయ ఈవో శ్రీధర్​ కుమార్, టెంపుల్​డెవలప్​మెంట్​చైర్మన్​అందె మహేందర్​రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.