డైనోసర్లదే రాజ్యం
ఇప్పుడంటే మనిషనేవాడు ఈ భూమిని ఏలుతున్నాడు కానీ, దాదాపు రెండొందల కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమిని ఏలిన జంతువులు డైనోసర్స్. భూగోళమంతా విస్తరించిన ఈ భయంకరమైన జంతువులు కొన్ని కోట్ల సంవత్సరాలు ఈ భూమ్మీద ఉన్నాయి. ఆరున్నర కోట్ల సంవత్సరాల క్రితం కాలగర్భంలో కలిసిపోయి.. మనకు ఇవ్వాళ సినిమా, నవల సబ్జెక్ట్ గా మాత్రమే మిగిలిపోయింది డైనోసర్.
అప్పట్లో ఇదే రాజు..
భూమి మీద జీవి మనుగడకు తగ్గ వాతావరణం ఎలా మారుతూ వచ్చిందన్నది ఒక మ్యాజిక్ చెప్పుకోవచ్చు. రెండొందల యాభై కోట్ల సంవత్సరాల క్రితం చాలానే జంతువులు, పక్షులు ఈ భూమ్మీద ఉన్నాయి. అయితే ఒక్కసారి వాతావరణం మారి, కొన్ని గ్రహశకలాలు భూమిని ఢీకొంటే భూమి అల్లకల్లోలం అయింది. దాదాపు అప్పటికి ఉన్న జీవులన్నీ చనిపోయాయి. మిగిలిపోయిన ఆ కొన్ని జీవుల నుంచి డైనోసర్స్ పుట్టుకొచ్చాయి. డైనోసర్స్ ఆ తర్వాత సంఖ్య పరంగా, వాటికున్న శక్తి పరంగా భూమి మీద ఉన్న ఇతర జంతువులపైన ఆధిపత్యాన్ని చూపించాయి. దాదాపు 150కోట్ల సంవత్సరాలు ఈ భూమిని ఏలింది డైనోసర్లే!
బ్లాక్బస్టర్ డైనోసర్!
డైనోసర్ల గురించి ఈ ప్రపంచానికి తెలిసింది 1842వ సంవత్సరంలోనే. అప్పట్నుంచి డైనోసర్లు ఎలా ఉండేవి, ఎంత కాలం జీవించాయి, వాటి ఆధిపత్యం ఎలా ఉండేదన్నది పరిశోధనలు చేస్తూ వచ్చాయి. లెక్కలేనన్ని సైన్స్ పుస్తకాలు వచ్చాయి. ఆ తర్వాత 20వ శతాబ్దంలో కథల్లోకి వచ్చింది డైనోసర్. డైనోసర్లు మనుషులు ఉన్న చోటుకి వస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో 'జురాసిక్ పార్క్' అనే నవల వచ్చింది. ఇది అప్పట్లో ఒక సెన్సేషన్. ఇదే నవలను సినిమాగా కూడా తీశారు. అప్పట్నుంచి ఇప్పటికీ 'జురాసిక్ పార్క్' సిరీస్ నడుస్తూనే ఉంది. ఈ సిరీస్లోలో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్బస్టరే!
పిల్లల ఫేవరైట్
డైనోసర్లు ఈ రోజుల్లో ఉంటే మన పరిస్థితి ఎలా ఉండేదో కానీ, పిల్లలైతే డైనోసర్లంటే ఎక్కడిలేని ఆసక్తి చూపిస్తుంటారు. నవలలు, సినిమాలు ఇంత పెద్ద హిట్ అవుతున్నాయంటే, అది వాళ్లకు ఉన్న ఈ ఆసక్తి వల్లనే. అన్నిసార్లూ సినిమాలు రావు కాబట్టి, 'జురాసిక్ పార్క్' పేర్లతో ప్రపంచమంతటా డైనోసర్ల బొమ్మలతో చేసిన పార్కులు, మ్యూజియంలు, ప్లే ఏరియాలు ఉన్నాయి.