బీబీ నగర్‎లో భారీ అగ్ని ప్రమాదం.. గోడౌన్‎లో ఎగిసిపడిన మంటలు

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ శివారులోని హిందుస్థాన్ సానిటరీ వేర్ గోడౌన్‎లో అగ్ని ప్రమాదం జరిగింది. హిందుస్థాన్ సానిటరీ వేర్ కంపెనీ పక్కనున్న పంట పొలాలలో గడ్డి తగలబెడుతుండగా నిప్పురవ్వలు ఎగిరిపడి గోడౌన్స్‎లోని కాటన్ బాక్స్‎లకు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. తీవ్ర భయాందోళనకు గురి కార్మికులు బయటకు పరగులు  చేశారు.

 గోడౌన్ సిబ్బంది, స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. గోడౌన్‎లో ఎగిసిపడుతోన్న మంటలను ఫైరింజన్ల సహయంతో అదుపు చేశారు. అగ్ని ప్రమాదం వల్ల  హిందుస్థాన్ సానిటరీ వేర్ కంపెనీకి ఎంత మేర నష్టం జరిగిందనేది ప్రస్తుతానికి తెలియదు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.