ఉమ్మడి జిల్లాలో .. ఏండ్లు గడిచినా తాత్కాలిక భవనాలే

  • కొత్త భవనాలకు నోచుకోని ప్రభుత్వ కార్యాలయాలు 
  • ఉమ్మడి జిల్లాలోని  17 కొత్త మండలాల్లో ఇదే పరిస్థితి

ఆసిఫాబాద్ ,వెలుగు : ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఏర్పడ్డ మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు సరైన భవనాలు లేవు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏడేండ్లయినా అధికారులు, లీడర్లు పట్టించుకోవడం లేదు. కొన్ని ఆఫీసులు శిథిలావస్థకు చేరిన భవనాల్లో కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 17 కొత్త మండలాలు ఉన్నాయి. ఆసిఫాబాద్ జిల్లా లో చింతలమనేపల్లీ ,పెంచికల్ పేట్,లింగపూర్, ఆదిలాబాద్ జిల్లాలో మవాల, సిరికొండ గాదిఏండ్లు గడిచినా తాత్కాలిక భవనాలే
గూడ , భీంపూర్, నిర్మల్ జిల్లా లో సోన్,నర్సపూర్ జీ, పెంబీ, నిర్మల్ అర్బన్, మంచిర్యాల జిల్లాలో నన్పపూర్, కన్నేపల్లి, హజీపూర్ భీమరం మండలాలు ఏర్పడ్డాయి.

Also Read:-భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలం

 ఈ మండలాల్లో కేవలం పోలీస్​స్టేషన్లకు కొత్త బిల్డింగ్​లు కట్టించారు. కొన్ని మండలాల్లో తహసీల్దార్ ఆఫీస్​లు కట్టినా అవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. నిత్యం ప్రజలకు పనులు ఉండే మండల పరిషత్, వ్యవసాయ శాఖ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, విద్యా శాఖ కార్యాలయం, ఐకేపీ సహా శాశ్వత ఆఫీసులు అవసరం ఉంది.  సిర్పూర్ నియోజకవర్గం లో కౌటాల, బెజ్జూర్, సిర్పూర్ టి మండలం ల్లోని గ్రామాలను కలుపుకొని చింతల మానేపల్లి మండలం ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు తహాసీల్దార్,ఎంపీడీఓ, ఐకేపీ కార్యాలయం మినహా నూతన ప్రభుత్వ కార్యాలయాలు శిథిలమైన స్కూల్ బిల్డింగ్​లో కొనసాగుతున్నాయి. ఏజెన్సీప్రాంతాలైన లింగాపూర్ మండలంలో మరింత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి.  ఇప్పటికైనా లీడర్లు స్పందించి  ఆఫీసులను ప్రజలకు అందుబాటులో నిర్మించాలని  డిమాండ్ చేస్తున్నారు.