కామారెడ్డిలోని పార్కుల్లో ఎక్కడా సౌలత్​ల్లేవు

కామారెడ్డిలోని పార్కుల్లో ఎక్కడా సౌలత్​ల్లేవు.. పిల్లలతో కలిసివెళ్లి కొద్దిసేపు సేదదీరే పరిస్థితి లేదు. చెట్లుఎండిపోయాయి. పిచ్చి మొక్కలు పెరిగాయి. పిల్లల ఆటవస్తువులు విరిగిపోయాయి. పార్కుల నిర్వహణపై మున్సిపల్ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.  

రాజీవ్​పార్కులో  పిల్లల ఆట వస్తువులు,  ఊయలలు, జారుడు బల్లలు విరిగిపోయాయి.  ఫౌంటేన్​ పని చేయట్లేదు. మిగతా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది.  గత ప్రభుత్వ హయాంలో  వార్డుకో పట్టణ ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. కానీ వాటి నిర్వహణ అధ్వాన్నంగా మారింది.   - కామారెడ్డి​, వెలుగు