Lifestyle: యాలకుల పాలను తాగితే ప్రయోజనాలు ఎన్నో.. తెలుసుకుందాం రండి

యాలకులు వీటిలో ఆరోగ్యకరమైన ప్రయోజనాలెన్నో.. యాలకులు జింగీ బెరాసెయ్ మొక్కల నుంచి లభిస్తాయి. మనదేశంతోపాటు నేపాల, భూటాన్, ఇండోనేషి యాలో కూడా పండిస్తుంటారు. సుగంధ ద్రవ్యాల్లో మహారాణిగాయాలకులను పరిగణిస్తారు. ప్రపంచంలోనే అత్యం త ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో యాలకులు ఒకటి. అలాంటి యాలకులను మనం నిత్యం మన ఆహారంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. పాలతో కలిపి యాలకును తీసుకోవడం వల్ల కలిగి ఆరోగ్య ప్రయోజనాలగురించి తెలుసుకుందాం.. 

ప్రతి రోజూ ఉదయం, రాత్రి పడుకునే ముందు యాలకులను పాలతో కలిపి తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. యాలకుల్లో మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, కాల్షియం, రైబోఫ్లావిన్, నియాసిన్ వంటి అనేక పోషకాలు అందుతాయి. పాలలో యాలకుల పొడిని కలుపుకొని  ప్రతిరోజూ తాగడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి  పెరుగుతుంది. గ్యాస్, ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 

యాలకుల పాలు తాగడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా నివారించవచ్చు. పాలలో యాలకులు లేదా యాలకు పొడిని జోడించడం వల్ల ప్రయోజనం రెట్టింపు అవుతుంది. ఒత్తిడి సరైన జీవన శైలి లేనివారు రోజూ పాలతో యాలకుల పొడిని తీసుకుంటే శరీరంలోని రోగనిరోధక శక్తి  పెరుగుతుంది. 

యాలకుల పాలను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ క్రమబద్ధం అ  వుతుంది. యాలకులలోని  పీచు జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యం ఉండేందుకు యాలకుల పాలు ఎంతగానో ఉపయోగపడతాయి. రోజూ యాలకులు తింటే గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడవు. 

యాలకుల్లో ఉండే యాంటీ ఆక్సిండెట గుణాలు, మాంగనీస్ శరీరం నుంచి టాక్సిన్స్ ను బయటకు పంపుతాయి. ఇది ఫ్రీ రాడికల్స్ ను నాశనం చేస్తుంది.