శంషాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా విమాన సర్వీసులు ఉన్నాయి. కానీ, అవి ఎక్కువ సంఖ్యలో లేవు. గోరఖ్ పూర్, లక్నో ఎయిర్పోర్ట్కు వెళ్తారు. అక్కడి నుంచి దాదాపు140 కిలో మీటర్ల దూరంలో ఉన్న అయోధ్యకు నాలుగ్గంటల ప్రయాణం బస్సు లేదా ట్రైన్లలో వెళ్లాలి. దేశంలోని అన్ని ప్రాంతాలకు రైలు కనెక్టివిటీ ఉంది. తెలంగాణ నుంచి డైరెక్ట్ రైళ్లు అయోధ్యకు లేవు. ట్రైన్లో వెళ్లాలనుకుంటే... సికింద్రాబాద్ నుంచి గోరఖ్పూర్ వెళ్లాలి.
అక్కడి నుంచి రైలు లేదా రోడ్డు మార్గంలో వెళ్లాలి. ప్రతి శుక్రవారం ఉదయం10 :50కి ట్రైన్ బయల్దేరుతుంది. 30 గంటలపాటు ప్రయాణం. దీంతోపాటు సికింద్రాబాద్ నుంచి బీదర్ – అయోధ్య వీక్లి ఎక్స్ప్రెస్ ఆది, సోమ వారాల్లో ఉంది. తెలంగాణ నుంచి అయోధ్యకు ట్రైన్లో వెళ్లాలనుకుంటే ఆది, సోమ, శుక్ర వారాల్లో వెళ్లొచ్చు.