కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూలో ఇంటి దొంగలు 

  • ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లు, అసెస్ మెంట్స్ లో ఇన్నాళ్లూ చేతివాటం
  • నాన్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కు రెసిడెన్షియల్ ట్యాక్స్
  • తాజాగా ఇద్దరు బిల్ కలెక్టర్ల సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అవినీతి వ్యవహారంపై చర్చ
  • ‘వెలుగు’లో కథనాలు, మంత్రి పొన్నం ఆదేశాలతో రెవెన్యూ విభాగంలో కదలిక
  • 450 బిల్డింగ్స్ రీఅసెస్ మెంట్ తో రూ.2.20 కోట్ల ఆదాయం 

 వాల్ మార్ట్ ఇండియా సంస్థది రోజూ కోట్లాది రూపాయల టర్నోవర్​. కాగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహించే బిల్డింగ్ ను బల్దియా రెవెన్యూ విభాగం అధికారులు రెసిడెన్షియల్ కేటగిరీ బిల్డింగ్​గా గుర్తించారు. దీంతో ఆ సంస్థ నుంచి వసూలు చేసే ప్రాపర్టీ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాలా తగ్గిపోయింది. అంతేగాక బిల్డింగ్ మొత్తాన్ని అసెస్ మెంట్ చేసి..

ఎన్ని స్వ్కైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫీట్లు ఉందో లెక్క గట్టి ట్యాక్స్ విధించాల్సి ఉండగా ప్లింత్ ఏరియాను కేవలం 999 స్వ్కైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫీట్లుగా నమోదు చేశారు. ఇటీవల ‘వీ6 వెలుగు’లో కథనాలు పబ్లిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావడంతో పారమిత స్కూల్ బిల్డింగ్ ను రీఅసెస్ మెంట్ చేసి ఏటా రూ.3.95 లక్షల ట్యాక్స్ వేసిన రెవెన్యూ సిబ్బంది.. దాని పక్కనే ఉన్న వాల్ మార్ట్ బిల్డింగ్ ను మాత్రం రీఅసెస్ చేయకపోవడం గమనార్హం. 

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేసే రెవెన్యూ విభాగం అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారింది. వసూలు చేసిన ఆస్తి పన్నును సొంతానికి వాడుకోవడమేగాక.. పూర్తిగా రికవరీ చేయకపోవడంతో బిల్ కలెక్టర్లు పి.శివరామకృష్ణ, దావు అంజయ్యను ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయి సస్పెండ్ చేయడంతో రెవెన్యూ విభాగంలో అవినీతి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లు, అసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొందరు రెవెన్యూ  సిబ్బంది, అందులోని కీలక అధికారి చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కమర్షియల్ బిల్డింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అతి తక్కువ ప్రాపర్టీ ట్యాక్స్ వచ్చేలా అసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి అందుకు ప్రతిఫలంగా ఓనర్ల నుంచి మామూళ్లు తీసుకుంటున్న  రెవెన్యూ సిబ్బందిపైనా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ 
వినిపిస్తోంది.

కమర్షియల్​ బిల్డింగ్స్​కు రెసిడెన్షియల్ ట్యాక్స్

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సుమారు 83 వేల అసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి. ఇందులో వేలాది బిల్డింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రెసిడెన్షియల్ కమ్ నాన్ రెసిడెన్షియల్ గా, మరికొన్నింటిని పూర్తి నాన్ రెసిడెన్షియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వినియోగిస్తున్నారు. కొందరు బిల్డింగ్స్ నిర్మాణ టైంలో రెసిడెన్షియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పర్మిషన్ తీసుకుని ఆ తర్వాత విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు, హాస్పిటల్స్ లాంటి కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్నారు. కానీ వాటిని మున్సిపల్ రికార్డుల్లో నాన్ రెసిడెన్షియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మార్చకపోవడంతో రెసిడెన్షియల్ ట్యాక్సే వస్తోంది.

దీంతో బల్దియా ఖజానాకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది. ఇలాంటి బిల్డింగ్స్ చాలానే ఉన్నా మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కరీంనగర్ బల్దియా పరిధిలో 27 పెట్రోల్ పంపులు ఉండగా.. 23 పంప్ లకు అసలు అసెస్ మెంటే చేయలేదని తెలిసింది. దీంతో వీటి నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు కావడం లేదు. అసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లోపాలు, అసలు చేయకపోవడంలాంటివే బల్దియాలో కొందరికి ఆదాయ వనరుగా మారింది. 

అసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ పూర్తయితే రూ.5కోట్ల ఆదాయం 

ఇటీవల కరీంనగర్ పద్మానగర్ లోని పారమిత స్కూల్ బిల్డింగ్ అసెస్ మెంట్, పర్మిషన్ లోపాలపై ఈ నెల 13న ‘వెలుగు’లో వచ్చిన స్టోరీతో కదిలిన రెవెన్యూ సిబ్బంది రీఅసెస్ మెంట్ చేసి ఏటా రూ.3.95 లక్షలు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించాలని నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఏరియర్స్ తో కలిపితే ఆ స్కూల్ నుంచి రూ.8.19 లక్షల వసూలు కాబోతున్నాయి. అప్పటి వరకు సదరు స్కూల్ బిల్డింగ్ ఓనర్ ఏటా రూ.67,132 మాత్రమే చెల్లించేవారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ నెల 18న కరీంనగర్ బల్దియాపై నిర్వహించిన రివ్యూలో పారమిత స్కూల్ బిల్డింగ్ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

అంతేగాక సిటీలో ఇలాంటి అసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాని, పర్మిషన్ లేని బిల్డింగ్స్ వివరాలు సేకరించి కలెక్టర్, అడిషనల్ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అందజేయాలని సిబ్బందిని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో ఎట్టకేలకు రంగంలోకి దిగిన మున్సిపల్ రెవెన్యూ యంత్రాంగం 950 నిర్మాణాలను గుర్తించింది. ఇందులో ఇప్పటివరకు 450 భవనాలను రీఅసెస్ మెంట్ చేయగా.. రూ.2.20 కోట్లు ప్రాపర్టీ ట్యాక్స్ కొత్తగా జనరేట్ అయ్యింది.  

మరో 500 భవనాల రీఅసెస్ మెంట్ పూర్తయితే మరో రూ.3 కోట్ల మేర ప్రాపర్టీ ట్యాక్స్ వచ్చే అవకాశముంది. ఈ లెక్కన మంత్రి పొన్నం రివ్యూ కారణంగా కార్పొరేషన్ ఖజానాలో రూ.5 కోట్లకుపైగా ట్యాక్స్ జమ కాబోతుంది. మూడంతస్తుల బిల్డింగ్ నిర్మించుకుని ఒక అంతస్తుకు మాత్రమే ప్రాపర్టీ ట్యాక్స్ చెల్తిస్తున్న బల్దియా ఇంజనీర్ యాదగిరిలాంటి ఇళ్లను కూడా రీఅసె స్ మెంట్ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. 

ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి కమిషనర్  ప్రత్యేక దృష్టి..

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస్ లీవ్ లో వెళ్లడంతో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దేశాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాధ్యతలు స్వీకరించారు. ఆయన బాధ్యతలు తీసుకున్నాక అనుమతి లేని, అసెస్ మెంట్ కాని బిల్డింగ్స్ పై ప్రత్యేక దృష్టి సారించారు. రోజూ బల్దియా ఆఫీసర్లతో రివ్యూ నిర్వహిస్తూ రీఅసెస్ మెంట్ ను వేగవంతం చేశారు. దీంతో ఇన్నాళ్లూ పాత ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లకే పరిమితమైన రెవెన్యూ సిబ్బంది.. రీఅసెస్ మెంట్ ద్వారా ప్రాపర్టీ ట్యాక్స్ పెంచే పనిలో 
పడ్డారు.