రుద్రూర్‌‌‌‌ ఎస్‌‌‌‌బీఐ ఏటీఎంలో చోరీ

వర్ని, వెలుగు : గుర్తు తెలియని వ్యక్తులు ఏటీఎంను ధ్వంసం చేసి క్యాష్‌‌‌‌బాక్స్‌‌‌‌ ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నిజామాబాద్‌‌‌‌ జిల్లా రుద్రూర్‌‌‌‌ బస్టాండ్‌‌‌‌ సమీపంలోని ఎస్‌‌‌‌బీఐ ఏటీఎంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఏటీఎం వద్దకు వచ్చి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలతో పాటు, ఏటీఎం సెంటర్‌‌‌‌లోని కెమెరాలకు స్ప్రే చేశారు.

తర్వాత ఏటీఎంను ధ్వంసం చేసి అందులోని క్యాష్‌‌‌‌ బాక్స్‌‌‌‌ను ఎత్తుకెళ్లారు. చోరీ జరిగిన విషయాన్ని ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏసీపీ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌, సీఐ జయేశ్‌‌‌‌రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌‌‌‌టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. దొంగలు ఎత్తుకెళ్లిన క్యాష్‌‌‌‌బాక్స్‌‌‌‌లో సుమారు రూ. 25 లక్షల వరకు ఉండొచ్చని తెలుస్తోంది.