నిజామాబాద్ జిల్లా/ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు. కాలనీలోని డోండి మెడికల్ స్టోర్లో గుర్తు తెలియని వ్యక్తులు దోపిడీకి పాల్పడ్డారు. గుర్తుతెలియని దొంగలు షట్టర్లను పగలగొట్టి లోపలికి ప్రవేశించి, కౌంటర్ లోని 4 లక్షల నగదును అపహరించారు. ముఖానికి ముసుగులు ధరించిన ఐదుగురు దొంగలు ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
సీసీ ఫుటేజీల ఆధారంగా ఆర్మూర్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి క్లూస్ టీం, పోలీసులు సంయుక్తంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రొఫెషనరీ సిపి సాయికుమార్ ఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నారు.