పెండ్లి ఇష్టం లేక యువతి ఆత్మహత్య

ధర్మారం, వెలుగు : తల్లిదండ్రులు పెండ్లికి బలవంతం చేస్తుండడంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికెనపల్లి గ్రామానికి చెందిన కాల్వ కనుకయ్య, కనుకవ్వ దంపతులకు ముగ్గురు కూతుర్లు. ఇద్దరు కూతుర్లుకు పెళ్లిళ్లు అయ్యాయి. చిన్న కూతురు సంధ్య(22) డిగ్రీ చదివి ప్రస్తుతం ఇంటివద్దే ఉంటోంది.

పైచదువులు చదువుకుంటానని తల్లిదండ్రులకు చెప్పినప్పటికీ ఆమెకు పెళ్లి నిశ్చయించారు. పెళ్లి ఇష్టం లేని సంధ్య ఆదివారం రాత్రి ఇంటి వాసానికి చున్నీతో ఉరేసుకుంది. తండ్రి కనుకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ధర్మారం ఎస్సై లక్ష్మణ్ తెలిపారు.