కామారెడ్డి, వెలుగు : రాజంపేట మండలం శివాయిపల్లి ప్రైమరీ స్కూల్ టీచర్ స్వామి బదిలీపై వెళ్లగా తిరిగి ఆయన్ని ఇక్కడే కొనసాగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. గతంలో మూతపడిన స్కూల్‌ను 2019లో తిరిగి ఓపెన్ చేయగా.. ప్రస్తుతం 180 మంది స్టూడెంట్స్చదువుతున్నారు.
5 ఏండ్లతో స్కూల్ ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. ఇక్కడ పని చేసిన టీచర్ స్వామి పొందూర్తికి బదిలీపై వెళ్లారని, తమకు ఇబ్బంది కలుగుతుందన్నారు. తిరిగి ఆయన్ని ఇక్కడే కొనసాగించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.