ముదురుతున్న ఎండలు..వేడిగాలితో జనం ఇబ్బందులు

నిజామాబాద్ జిల్లాలో ఎండలు ముదురుతున్నాయి. మధ్యాహ్నం పన్నెండు నుంచి ఎండ తీవ్రత పెరుగుతుంది. ఉక్కపోత, వేడిగాలితో జనం ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో 38 నుంచి40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండాకాలం షురూలోనే ఇంత ఎండలుంటే మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం భయపడుతున్నారు.