ఆఫీస్ అంటే ఇలా ఉండాలి : పని మానేసి బీరు పార్టీలకు రండి.. ఎక్కడో తెలుసా..!

చిన్నప్పుడు స్కూల్ ఎగ్గొట్టి ఫ్రెండ్స్లో కలిసి ఆడుకునే ఉంటారు. కాలేజీ బంక్కొట్టి సినిమాలు, షికార్లకు వెళ్లే ఉంటారు. అయితే ఇంకేం... ఆఫీసుకూడా బంకొకొట్టి బీర్  పార్టీకి వచ్చేయండి' అంటోంది లండన్కు చెందిన ఒకసంస్థ. 'ద సేష్' పేరుతో ఉన్నే ఒక ఫేస్బుక్ పేజ్ ఇలా అందరినీఆహ్వానిస్తోంది. ఇంతకీ ఏంటి దీని కథ? తెలుసుకోండి.

ప్రైవేటు కంపెనీల్లో జాబ్ చేసే ఉద్యోగులు శ్రీ జీవితాలు వాళ్ల చేతుల్లో ఉండవు. వారాంతంలో దొరికే ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే వాళ్లవి. మిగతా రోజుల్లో సగం కంపెనీలకే కేటాయించాలి. ఎప్పుడైనా అవసరమైతే లీవ్ పెట్టొచ్చు. ఒకవేళ డ్యూటీలో ఉన్నప్పుడు మధ్యలో బయటికి వెళ్లాల్సొస్తే చాలా కష్టం. ఎంతో ముఖ్యమైన పని అయితే తప్ప పర్మిషన్ దొరకదు. చాలా మందికి ఇలా డ్యూటీ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు మధ్యలో బయటికెళ్లి ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. బాగా హ్యాపీగా ఉన్నా, మూడీగా ఉన్నా బయటికెళ్లి మందు తాగాలనిపిస్తుంది. అయితే ఇది కూడా సాధ్యం కాదు. కాదని ముందుకెళ్తే బాస్ చేత చీవాట్లు తప్పవు. రోజు ఇలాగే చేస్తే ఉద్యోగానికి గ్యారెంటీ లేదు. అయితే చాలా మంది లోపల ఒక తిరుగుబాటుదారుడు ఉంటాడు. వాడు మాత్రం ఇలాంటిఅవకాశాల కోసం ఎదురుచూస్తుంటాడు. అలాంటి వాళ్లకోసమే 'దసేష్' ఫేస్బుక్ పేజ్ ఒక కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతోంది. 

డ్యూటీ వదిలేసి పార్టీ 

'ద సేష్' ఫేస్బుక్ పేజీ ఒక కొత్త పార్టీ స్లోగన్ ముందుకొచ్చింది. అదే 'లీవ్ వర్క్ అండ్ గోటుబీర్ గార్డెన్, కాంట్ శాక్ అల్ ఆఫ్ అజ్' అంటే పని వదిలేసి బీర్ గార్డెనక్కు రండి. వాళ్లు కంపెనీ యాజమాన్యాలు) మనల్నేం చేయలేదు' అని దీని ఉద్దేశం. ఈ పేజీ ఆధ్వర్యంలో ఆగస్ట్ పందొమ్మిదిన లండన్లోని బీర్ గార్డెన్లో ఒక బీర్ పార్టీని ఏర్పాటు చేయబోతుంది. ఇక్కడికి ఉద్యోగుల్ని పని వదిలేసి మధ్యాహ్నం పన్నెందుకల్లా రావాలని కోరింది. దీనికి ఫేస్ బుక్లో రెండు లక్షల మందికి పైగా ఆసక్తి చూపించారు. మనదేశంలో తక్కువే కానీ, విదేశాల్లో బీర్ గార్డెన్స్ చాలా కామన్. ఇక్కడ బార్లు ఎలాగో అక్కడ బీర్ గార్డెన్స్ అలా. గార్డెన్ ఉన్న ఓ ఫేస్లోనే బీడ్స్ సర్వ్ చేస్తుంటారు. అలాంటి చోట బీర్ తాగితే బాగుంటుందని చాలా మంది అభిప్రాయం. అయితే ఈ సారి మధ్యాహ్నం ఆఫీస్ బంక్ కొట్టి మరీ బీర్ గార్డెను వెళ్తుండటంతో చాలా మంది దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు.

నెటిజన్ల స్పందన 

ఈ ఈవెంట్ పై చాలా మంది సోషల్ మీడియాలో పాజిటివ్ గానే స్పందిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పార్టీలు బోలెడు జరుగుతాయంటున్నారు. కొందరు నెటిజనైతే 'చాలా ఫన్నీగా స్పందిస్తున్నారు. 'ఆగస్ట్ పందొమ్మిదిన అందరిలాగే బీర్ గార్డెన్ స్టాఫ్ కూడా బండ్ కొడితే పార్టీ ఎలా? అని ఒకరు 'ఈ ఈవెంట్ కోసం అన్ని రోజులు ఆగాలా... ఇవాళ, రేపో ఉంటే బాగుండు' అని మరొకరు అంటుంటే.. 'దీని కోసం జాబ్ను రిస్క్ పెట్టకండి. అవసరమైతే ఎలాగోలా పర్మిషన్ తీసుకుని రండి' అని ఇంకొకరు సలహా ఇస్తున్నారు.