Good Health : జింక్తో రోగాలకు చెక్

వయసుతో పాటు పలు ఆరోగ్య సమస్యలూ వస్తుంటాయి. వీటిని తగ్గించేందుకు శాస్త్రవేత్తలు ఇప్పటికీ పరిశోధనలు చేస్తునే ఉన్నారు. తాజాగా అలబామా యూనివర్సిటీతో పాటు డాక్టర్ ఇవనోవీ సంయుక్తంగా చేపట్టిన ఓ పరిశోధన ఆసక్తికరమైన ఫలితాలను వెల్లడించింది. 

మనకు అత్యవసరమైన సూక్ష్మపోషకాల్లో ఒకటైన జింక్.. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని వీరు గుర్తించారు. కాఫీ, టీ, చాకొలేట్ వంటి వాటితో కలిపి తీసుకున్నప్పుడు జింక్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు, హాని కలిగించే ఫ్రీరాడికల్స్ మధ్య సమతుల్యత దెబ్బతిన్నప్పుడు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. 

ALSO READ | Good Health : పొద్దున్నే బాదం గింజలు.. అరటి పండు తినండి... అస్సలు నీరసం ఉండదంట

ఇది మధుమేహం మొదలుకొని అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమని పరిశోధనల్లో తేలింది. ఈ నేపథ్యంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ కు కారణమవుతున్న సూపర్ ఆక్సైడ్ ను ఎదుర్కోవడంలో జింక్ పనికొస్తుందని, అందుకే జింక్ ఎక్కువగా ఉండే నట్స్, మొలకలు, పాల పదార్ధాలు, గుడ్డు వంటివి తీసుకోవడం మంచిదని డాక్టర్ ఇవనోవీ అంటున్నారు.