పెళ్లొద్దు.. పేరంటాలు వద్దూ : చైనాలో 10 లక్షలు తగ్గిన వివాహాలు.. పెళ్లెత్తితే చాలు చిరాకులు

చైనా.. చైనా.. ఒకప్పుడు జనాభా గురించి మాట్లాడుకునేవాళ్లు.. ఇప్పుడు కూడా జనాభా గురించే మాట్లాడుకుంటున్నారు.. అప్పట్లో అత్యధిక జనాభా గురించి.. ఇప్పుడు తగ్గుతున్న జనం గురించి.. అవునా.. ఇప్పుడు చైనా వింత పరిస్థితి ఎదుర్కొంటుంది. యువత అస్సలు పెళ్లి చేసుకోవటం లేదు.. పెళ్లీ లేదూ పేరంటాలు లేవు అంటూ హ్యాపీగా గడిపేస్తున్నారు. పెళ్లి మాట ఎత్తితే చాలు చిరాకు పడుతున్నారంట చైనా యువత.. ఇదేమీ మామూలుగా చెప్పటం లేదు.. లెక్కలతో సహా చైనా విడుదల చేసిన డేటానే స్పష్టం చేస్తుంది. చైనా మ్యారేజ్ రిజిస్ట్రేషన్‌ను సరళీకృతం చేయడానికి ముసాయిదా చట్టాన్ని కూడా సవరించింది. అలాగే విడాకులు కష్టతరం చేస్తుంది. 2024 మొదటి 9నెలల్లో 1.967 మిలియన్ విడాకులు నమోదయ్యాయి. అది 2023 సంవత్సరంతో పోల్చకుంటే 6వేల తగ్గుదల ఉంది. 

2023వ సంవత్సరం జనవరి నుంచి సెప్టెంబర్ వరకు.. అంటే ఈ తొమ్మిది నెలల్లోనే 56 లక్షల పెళ్లిళ్లు జరిగాయి. అదే 2024 సంవత్సరం.. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు కేవలం 47 లక్షల వివాహాలు జరిగాయంట.. ఈ లెక్కలు పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖనే స్వయంగా వెల్లడించింది. అంటే ఏడాదిలో ఏకంగా 9 లక్షల పెళ్లిళ్లు తగ్గిపోయాయి అంట.. మరి పెళ్లీడు వచ్చిన పిల్లలు లేరా అంటే అబ్బో కుప్పలు, తెప్పలుగా ఉన్నారంట.. కానీ పెళ్లి చేసుకోవటం లేదంట.. ఏమైనా లోపాలు ఉన్నాయా అంటే.. అబ్బే అదీ లేదంట.. నిక్షేపంగా మగాళ్లుగానే ఉన్నారంట.. మరి పెళ్లి ఎందుకు చేసుకోవటం లేదంట.. బోలెడు కారణాలు చెబుతున్నారంట.. వాళ్ల భయాలు ఏంటో తెలుసుకుందామా..

ALSO READ : మారరా మీరు..: పాకిస్తాన్‌లో పొల్యూషన్.. మన దేశంపై పడి ఏడుస్తున్నారు


>>> ఉద్యోగ భద్రత లేదు.. ఉద్యోగంతో వచ్చే జీతాలు సరిపోవటం లేదు. చాలీచాలని సంపాదనతో పెళ్లిపై విముఖత
>>> ఖర్చులు విపరీతంగా పెరిగాయి.. ధరలు పెరిగాయి.. సోలోగా హ్యాపీగా బతకటానికే సంపాదన సరిపోవటం లేదు.. ఇంక పెళ్లి చేసుకుని ఏం పోషిస్తాం.. పిల్లలను ఎలా పెంచుతాం అనే భయం.
>>> ఆర్థిక మాంద్యంతో ఐటీ, ఇతర రంగాల్లో ఉద్యోగాల తీసివేతలు ఉన్నాయి. ఈ కారణం కూడా ఒకటి అంటున్నారు అక్కడి అధికారులు. 
>>> అమ్మాయిల కోరికలు విపరీతంగా పెరిగాయి. వాళ్ల ఆశలు విపరీతంగా ఉన్నాయి. అబ్బాయికి మంచి ఉద్యోగం, జీతం, ఆస్తులు అన్నీ ఉండాలనే కోరికలతో చాలా మంది  పెళ్లిపైనే విరక్తికి వచ్చారు.
>>> దీనికితోడు పెళ్లి చేసుకున్న వారు విడాకులు తీసుకుంటున్న కేసులు విపరీతంగా పెరిగాయి. 
>>> 2024లో.. జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య తొమ్మిది నెలల్లోనే ఏకంగా 19 లక్షల జంటలు విడాకులు తీసుకున్నాయి. వీళ్లందరూ కూడా రెండు, మూడు, నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న వారే..
>>> పెరుగుతున్న విడాకులను కంట్రోల్ చేయటం కోసం చైనా ప్రభుత్వం కఠినమైన చట్టాలను తీసుకొచ్చింది. దీంతో 2023తో పోల్చితే 6 వేల విడాకుల కేసులు తగ్గాయి. 
>>> ఇదే సమయంలో యువతలోనూ భయాలు పెరిగాయి. పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకోవాలని భావించినా.. అది కష్టంగా మారటంతో.. అసలు పెళ్లే చేసుకోవటం వేస్ట్ అని భావనకు వచ్చారు..