- పరిశోధనలు చేసి నివేదిక ఇచ్చిన వాటర్‌బోర్డు ఆఫీసర్
- గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వాటర్‌బోర్డు ఎండీ
- సిల్ట్ప్రాసెసింగ్కు ముందుకొచ్చిన రెండు కంపెనీలు
- ఇసుకను ప్రభుత్వ పనులతో పాటు ప్రైవేటుకు అమ్ముకునే ఆలోచన
హైదరాబాద్‌సిటీ, వెలుగు : గ్రేటర్ పరిధిలో డ్రైనేజీల నుంచి తీసే సిల్ట్ నుంచి ఇసుకను వేరుచేయాలని మెట్రోవాటర్‌బోర్డు భావిస్తోంది. ఆ ఇసుకను ప్రభుత్వ పనులకు వినియోగించాలని, అలాగే ప్రైవేట్వ్యక్తులకు అమ్మి ఆదాయం పెంచుకోవచ్చని చూస్తోంది. సాధారణంగా డ్రైనేజీ నుంచి తీసిన పూడికలో బురద, చెత్త, చెదారంతో పాటు ఇసుక ఎక్కువగా ఉంటోంది. మ్యాన్‌హోళ్ల వద్ద కుప్పలుగా పోసే ఈ వ్యర్థాన్ని ఎండిన తర్వాత ఇసుకగా కనిపిస్తుంది.
వెంటన తరలించకపోతే వారం రోజుల్లో తిరిగి అదంతా మళ్లీ డ్రైనేజీల్లోనే కలిసిపోతోంది. ఈ క్రమంలో సిల్ట్ ను ఇసుకగా మార్చే ప్రక్రియపై వాటర్‌బోర్డు అధికారులు దృష్టి పెట్టారు. బోర్డుకు చెందిన ఓ ఉన్నతాధికారి పరిశోధనలు చేసి సిల్ట్‌ను ఉపయోగించుకునే విధానంపై రిపోర్ట్తయారు చేశాడు. విషయాన్ని బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి దృష్టికి తీసుకుపోగా ఆయన కొత్త ప్రక్రియకు గ్రీన్సిగ్నల్ఇచ్చారు.
ఈ ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకుపోవాలన్న దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో డ్రైనేజీల నుంచి వెలువడే సిల్ట్‌ను నేరుగా అంబర్‌పేట, అత్తాపూర్తదితర ప్రాంతాల్లోని బోర్డు స్థలాల్లోనే నిల్వ చేయనున్నారు.
రోజుకు 15 లారీల సిల్ట్
గ్రేటర్‌పరిధిలో దాదాపు 45 చదరపు కిలోమీటర్ల డ్రైనేజీ లైన్లు విస్తరించి ఉండగా, 3లక్షల వరకూ మ్యాన్‌హోల్స్ ఉన్నాయి. 30 ఏండ్లుగా గ్రేటర్‌పరిధిలోని డ్రైనేజీ లైన్లను భారీ ఎత్తున డీసిల్టింగ్చేసింది లేదు. ప్రస్తుతం వాటర్‌బోర్డు 90 రోజుల స్పెషల్ డ్రైవ్కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 60 వేలకు పైగా మ్యాన్‌హోళ్ల డీసిల్టింగ్పనులు పూర్తి చేయగా టన్నుల కొద్దీ సిల్ట్ బయటకు వచ్చింది. లక్ష మ్యాన్‌హోళ్లను క్లీన్చేయాలని లక్ష్యంగా పెట్టుకుని, ప్రతి రోజూ వందల సంఖ్యలో డ్రైనేజీల్లో డీసిల్టింగ్పనులు చేస్తున్నారు. ట్రంక్మెయిన్ల నుంచి కూడా భారీగానే ఇసుక వస్తోంది.
ఇదంతా కలిపి రోజుకు సుమారు 15 లారీలు ఉంటోందని తెలుస్తోంది. దీన్ని సిల్ట్కార్టింగ్వాహనాల్లో అంబర్‌పేట ఎస్టీపీ ప్రాంగణం, అత్తాపూర్‌లోని బోర్డుకు చెందిన ప్రాంతానికి తరలించి నిల్వ చేస్తున్నారు. సిల్ట్నుంచి ఇసుకను ప్రాసెస్ చేసేందుకు రెండు కంపెనీలు ముందుకు వచ్చాయని, వారికి పనులు అప్పగించే విషయాన్ని ఆలోచిస్తున్నట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు.
ఇసుక క్వాలిటీకి ఢోకా లేదు..
డ్రైనేజీల నుంచి తీసే సిల్ట్‌లో 90 శాతం ఇసుక రేణువులే ఉంటున్నాయి. సిల్ట్‌ను ప్రాసెస్చేయడంతో రోజుకు కనీసం 150 నుంచి 200 టన్నుల ఇసుక వచ్చే అవకాశం ఉందని వాటర్‌బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఇసుక రంగు నల్లగా ఉంటుందని, నాణ్యతలో ఎలాంటి తేడా ఉండదని చెబుతున్నారు. ప్రభుత్వ సంస్థలు, బల్దియా, వాటర్‌బోర్డు, ఎలక్ట్రిసిటీ సంస్థలు చేపట్టే నిర్మాణ పనుల్లో వినియోగించుకోవచ్చని
ప్రస్తుతం ఇసుక ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో సిల్ట్నుంచి తీసే ఇసుకను వినియోగించుకునేందుకు నిర్మాణదారులు ఆసక్తి చూపించే అవకాశం ఉందని అంటున్నారు. ఎవరైనా ఇసుక కొనడానికి ఆసక్తి కనబరిస్తే సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
టైల్స్ తయారు చేయొచ్చు
మ్యాన్‌హోళ్ల నుంచి తీసే సిల్ట్‌ను ప్రాసెస్ చేయగా వచ్చే ఇసుకతో టైల్స్ తయారు చేయవచ్చని వాటర్‌బోర్డులోని ఓ అధికారి తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ప్రయోగం చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఫుట్‌పాత్‌లపై వేసే రఫ్టైల్స్కు బ్లాక్సాండ్వాడతారు. కొన్ని కంపెనీలు సిల్ట్నుంచి వచ్చే ఇసుకతోనూ టైల్స్తయారు చేస్తున్నాయి. మన రాష్ట్రంలోనూ అలాంటి కంపెనీ ఏదైనా ముందుకు వస్తే వారికి పనులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.