బాధ్యతలు చేపట్టిన అర్బన్ బ్యాంక్ పాలకవర్గం

కరీంనగర్ సిటీ, వెలుగు : అర్బన్ బ్యాంక్ కరీంనగర్  పాలకవర్గ సభ్యులు శనివారం  బాధ్యతలు చేపట్టారు.ఈసందర్బంగా అర్బన్ బ్యాంక్ సిబ్బంది వారిని  శాలువాలతో సత్కరించారు. ఏళ్లుగా పెండింగ్​లో ఉన్న డివిడెంట్ ఫండ్ విడుదలకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే గంగాధర నూతన  బ్రాంచ్ ప్రారంభోత్సవంతో పాటు కరీంనగర్ మెయిన్ బ్రాంచ్ పరిధిలో ఏటీఎం సెంటర్ ను ప్రారంభిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో  ఇంచార్జి కమిటీ సభ్యులు గడ్డం విలాస్ రెడ్డి, మడుపు మోహన్, ముక్క భాస్కర్, బీరం ఆంజనేయులు, మహ్మద్ కలీం ఖాన్, రేగొండ సందీప్, మూల లక్ష్మి రవీందర్ రెడ్డి, ఏ. విద్యాసాగర్,  లక్ష్మన్ రాజు, ఎండీ. సమీయొద్దీన్, మంగి రవీందర్  పాల్గొన్నారు.