నిజం.. ఇది నిజాంసాగర్ కాలువే

  • ప్రధాన కాలువలో చెత్తా, వ్యర్థాలు, ముళ్ల కంపలు, పిచ్చి మొక్కలు 

నిజాంసాగర్ ప్రధాన కాలువ శిథిలమైంది. నందిపేట్​ మండలంలోని అర్గుల్ రాజారాం గుత్ప ఎత్తిపోతల పథకం ద్వారా బ్యాక్ వాటర్​ నీటిని నిజాంసాగర్​ కాలువ ద్వారా ఆర్మూర్ ప్రాంత చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందిస్తారు. ప్రస్తుతం ఈ నిజాంసాగర్ కాలువ దుస్థితి అధ్వానంగా మారిపోయింది. హద్దు రాళ్ళు ఊడిపోయి..  పిచ్చి మొక్కలు పెరిగి ముళ్లలు పెరిగి కాలువ కనిపించకుండా పోతోంది. 

 కొన్నిచోట్ల కాలువల్లో వ్యర్థాలను కాలువల్లో పారేయడంతో డ్రైనేజీని తలపిస్తుంది.  కాలువ శిథిలం కావడంతో ఆర్మూర్​ టౌన్ లోని టీచర్స్ కాలనీ, కమల నెహ్రు కాలనీ, జర్నలిస్టు కాలనీ, జిరాయత్ నగర్, హౌజింగ్ బోర్డు కాలనీల్లో నీటి సరఫరా జరిగిన సమయంలో నీరంతా కాలనీల్లోకి వచ్చి చెరువులను తలపిస్తుంది.  ఇరిగేషన్ ఆఫీసర్స్ స్పందించి కాలువ మరమ్మతులు చేసి నిజాంసాగర్ కాలువ గానే మార్చాలని ప్రజలు కోరుతున్నారు. 

ఆర్మూర్, వెలుగు