నార్వేలో స్కిడ్ అయిన ఫ్లైట్.. తృటిలో ప్రాణాలతో బయటపడ్డ 182 మంది

ఓస్లో: ఎమర్జెన్సీ ల్యాండింగ్ తర్వాత విమానం రన్ వేపై నుంచి స్కిడ్ అయింది. నార్వేలోని ఓస్లో టార్ప్ సాండెఫ్ జోర్డ్ విమానాశ్రయంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. కేఎల్ఎం రాయల్ డచ్ ఎయిర్ లైన్స్ విమానం ఓస్లో నుంచి ఆమ్ స్టర్ డామ్​వెళ్లేందుకు టేకాఫ్ అయింది. ఆ తర్వాత కాసేపటికే ఫ్లైట్‎లో హైడ్రాలిక్ ఫెయిల్యూర్ సమస్య తలెత్తింది. దీంతో పైలెట్లు విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఓస్లో ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్​చేశారు. ల్యాండ్ అయిన తర్వాత విమానం రన్ వేపై నుంచి స్కిడ్ అయి ట్యాక్సీవే వరకు వెళ్లి ఆగింది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు. ఆ సమయంలో విమానంలో సిబ్బంది, ప్రయాణికులు కలిపి 182 మంది ఉన్నారు.